సీనియర్ నటిని రేప్ చేస్తామంటూ బెదిరింపు

సినీ నటి , కాంగ్రెస్ నేత కుష్బూ కు ఓ ఆగంతకుడు రేప్ చేస్తానంటూ బెదిరించాడట. దీంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారమిచ్చి, నేరుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగకుండా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేస్తూ ఆ వ్యక్తి ఆ ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో పెట్టేసింది” అంతేకాకుండా దానిని మమతా బెనర్జీకి ట్యాగ్ చేసింది.

ఎందుకంటే తనను బెదిరించిన వ్యక్తి నంబర్ కోల్ కతాకు చెందినదని కుష్బూ ట్రూ కాలర్ ద్వారా గుర్తించింది. ఆ ట్విట్ లో ”దీదీ నాకే ఇలాంటి బెదిరింపులు ఎదురువుతున్నాయంటే.. ఇతర మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరింది” . అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన ఆ వ్యక్తి నంబర్‌ను బహిర్గతం చేయడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయగా, దానికి కూడా స్పందించిన కుష్బూ ఇలాంటి పనులు చేసే వారి పరువు పబ్లిక్ గా తీయాలని.. వాడికి కూడా కుటుంబం ఉంటుంది కదా అని సమాధానం ఇచ్చింది.