జగన్ కోసం రంగంలోకి దిగిన కేటీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ఫెడరల్ ఫ్రెంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో చర్చలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఐతే, ఆ బాధ్యతని
కేటీఆర్ కి అప్పగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ బృందం ఇవాళ వైఎస్ జగన్ ని కలవబోతుంది. హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌తో కేటీఆర్‌ బృందం చర్చలు జరుపుతుంది.

గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ ని తన స్నేహితుడిగా పేర్కొంటు వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి రాబోతున్నాడని పలు సందర్భాల్లో బాహాటంగానే అన్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ చేరే అవకాశాలున్నాయి. ఇక, ఫ్రంట్‌ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.