స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటీ హైలైట్స్..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీ గా ఉన్నారు. కొద్దీ సేపటి క్రితం ఈయన కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో చేనేత సమస్యలపై ఫై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. స్మృతి ఇరానీతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

చేనేత కార్మికుల సమస్యలను స్మృతి ఇరానీతో వివరించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ర్టానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు మీడియాకు తెలియజేసారు. ఈ క్లస్టర్ల వల్ల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. మరమగ్గాల ఆధునికీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి చెప్పారని, 8 వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్ర నిధులు కోరామని పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ పేర్కొన్నాడు.