ఈషా రెబ్బా కు కేటీఆర్ సమాధానం..

ప్లాస్టిక్‌ కవర్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీం తో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, పచ్చని ప్రకృతి అంతరించి పోవటంతో పాటు, వాయు కాలుష్యంతో మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అయినా జీవన విధ్వంసానికి కారణమవుతు న్న ప్లాస్టిక్‌ను నిషేధించటంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని పలువురు సామాజిక, విద్య వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో తాజాగా సినీ నటి ఈషా రెబ్బా ప్లాస్టిక్‌ నిషేధం గురించి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.

‘భారతదేశంలో ఏ రాష్ట్రం ప్లాస్టిక్‌ను నిషేధించింది? మన రాష్ట్రం వివిధ రంగాలలో నం.1గా ఎదగడం చూశా. కానీ ప్లాస్టిక్‌ను నిషేధించిన రాష్ట్రాల్లో మన పేరు లేకపోవడం నిరాశకు గురి చేస్తోంది. భవిష్యత్తు తరాల కోసం ఈ విషయం గురించి దయచేసి ఆలోచించండి’ అని ఈషా , కేటీఆర్‌ ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసింది.

ఈషా ట్వీట్ కు కేటీఆర్ సమాధానం తెలిపారు.”ప్లాస్టిక్‌ నిషేధం కోసం చట్టంలో ఉన్న ఆమోదాలు సహాయపడటం లేదు. చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి తీవ్రంగా పని చేయాల్సి ఉంది. అధికారులు, తయారీదారులు, మొత్తం సివిల్‌ సొసైటీ.. మేమంతా కలిసి ఈ దిశగా చర్యలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం’ అని ఆయన సమాధానం ఇచ్చారు.