#మీటూ ఎఫెక్ట్.. ఆ మంత్రి పదవి ఉండనుంది !

ఇన్నాళ్లు కేవలం చిత్ర పరిశ్రమలోనే లైంగిక వేధింపులు ఉంటాయని అనుకొనేవారు. ఇప్పుడు #మీటూ ఉద్యమంతో అవి అన్ని చోట్లా, అన్ని రంగాల్లో ఉన్నాయనే విషయం అర్థమైంది. ఐతే, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ మంత్రి పదవి ఊడనుందనే ప్రచారం జరుగుతోంది. ఆయనపై పలువురు మహిళా పాత్రికేయులు లైంగిక ఆరోపణలు చేశారు. దీనిపై భాజాపా మౌనం వహిస్తోంది.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్‌ ఆదివారం(అక్టోబరు 14న) తిరిగి రానున్నారు. ఆయన రాగానే దీనిపై భాజాపా ఓ నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో అక్బర్‌ పై భాజాపా చర్యలు తీసుకోవడం.. ఆయన మంత్రి పదవి ఊడటం ఖాయమని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే.. #మీటూ ఎఫెక్ట్ తో చోటు చేసుకొన్న అది పెద్ద రియాక్షన్ గా దీన్ని చెప్పవచ్చు.