రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మురళీ మోహన్

సినీ నటుడు , తెలుగుదేశం నేత మురళీ మోహన్ రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. చిత్రసీమ లో ఎంతో పేరు , డబ్బు సంపాదించిన ఈయన..ఆ తర్వాత పలు వ్యాపారాలు మొదలుపెట్టి కోట్లు వెనకేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రబాబు రాజకీయాల్లోకి రమ్మని పిలవడం తో తెలుగుదేశం పార్టీ లో చేరి ఎంపీగా చేసారు.

గత పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈయన..తాజాగా మాట్లాడుతూ రాజకీయాలు వదిలేసానని.. రాజకీయాల్లో చేరి చాల తప్పు చేసానని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు అంత ఎంతో గౌరవించారని , కానీ రాజకీయాల్లోకి వెళ్లగానే చాలామంది నన్ను తిట్టడం చేసారని వాపోయాడు. అసలు రాజకీయాలే ఇష్టంలేదని చెపుతున్నప్పటికీ చంద్రబాబు నన్ను ఒప్పించి రాజకీయాల్లో వచ్చేలా చేసాడని చెప్పుకొచ్చాడు.

రాజకీయాల్లోకి రావడం వల్ల పదేళ్లు వేస్ట్ చేసుకున్నాను.. ఇప్పుడు నాకు ఎనభై ఏళ్లు.. మహా అయితే ఇంకో పదేళ్లు యాక్టివ్‌గా ఉంటాను.. తరువాత ఎలా ఉంటానో తెలియదు. నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది పాలిటిక్స్‌లోకి రావడమే.. ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా? టీడీపీలో చేరి తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లకూడదని..రాజకీయాలకు నాకు రాం..రాం అని చెప్పేసాడు.