‘దిశ’ ఎన్ కౌంటర్ ఘటన ఫై సుప్రీం కోర్ట్ షాకింగ్ నిర్ణయం..

హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. కాగా ఈ ఎన్ కౌంటర్ ఫై సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు కావడం తో పోలీసులను విచారిస్తుంది సుప్రీం కోర్ట్. విచారణ లో భాగంగా కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఉన్నత స్థాయి విచారణ కోసం ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిషన్‌ను నియమించింది. వీరిలో విశ్రాంత న్యాయమూర్తులు వీఎస్ సిర్పుర్కార్, రేఖ (బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి), మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్‌లను ధర్మాసనం నియమించింది. ఈ కమిషన్‌కు వీఎస్ సిర్పుర్కార్ నాయకత్వం వహించనుండగా, వీరికి సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తుందని ధర్మాసనం వెల్లడించింది.

హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు చేయాలని ఆ కమిటీకి సూచించింది. ఎన్ కౌంటర్ పై విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది.