అక్టోబర్‌ నుంచి నిరుద్యోగభృతి

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకు పెద్ద హామీలే ఇచ్చింది. ఇందులో ఇంటికో జాబ్. బాబు వస్తేనే జాబు వస్తోంది ప్రచారం చేశారు. దీంతో పాటు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఐతే, కొద్దికాలంగా నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడీ కసరత్తు పూర్తయ్యినట్టు సమాచారమ్.

తాజాగా, నిరుద్యోగ భృతిపై మంత్రి లోకేష్ స్పందించారు. వచ్చే అక్టోబర్‌ నుంచి యువతకు రూ.వెయ్యి నిరుద్యోగభృతి ఇస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం లోకేష్ పర్యటించారు. జిల్లాలోని పెనుగొండలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమే అయినా మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడు ఒక్కమాట కూడా అనడం లేదని పరోక్షంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.