కేసీఆర్ కేబినేట్ లో హరీష్’కు స్థానం లేదు !?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినేట్ విస్తరణకు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. రేపు (ఫిబ్రవరి 19) కేబినేట్ విస్తరణ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కేబినేట్ పై పూర్తిస్థాయి కసరత్తు పూర్తయ్యింది. సీఎం కేసీఆర్‌ 9మందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారమ్. ఇందులో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు స్థానం దక్కునుంది.

షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ సారి సీఎం కేసీఆర్ కేబినేట్ లో హరీష్ రావులు స్థానం దక్కలేదని తెలిసింది. గత మంత్రివర్గంలో పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు మరోసారి అవకాశం దక్కనుండగా.. హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు అవకాశం లేనట్లేనని సమాచారమ్. ఇదే నిజమైతే.. హరీష్ రావుని పార్టీ నుంచి పొమ్మనక పొగపెట్టుట ప్రయత్నాలు ముమ్మరం అయినట్టే లెక్క. మరీ.. హరీష్ ఏ స్టప్ తీసుకుంటాడో చూడాలి.