ఇంత జరిగినా చంద్రబాబు పై సింపతీ లేదు !


తెలుగుదేశం పార్టీ సంక్షోభంలోకి వెళ్ళింది. అదను చూసి నలుగులు రాజ్యసభ ఎంపీలు బిజెపిలోకి వెళ్ళిపోయారు . ఇంకా చాలామంది నాయకులు పార్టీ వీడడాని సిద్దంగా వున్నారు. అయితే ఇంతజరుగుతున్నా చంద్రబాబుపై ఎవరికీ సింపతి కలగడం లేదు. దీనికి కారణం చంద్రబాబు చేసిన తప్పులే. అధికారం కోసం, అధికారంలో వున్నపుడు… చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసినతప్పులు, వేసిన ఎత్తులు.. నైతిక విలువలు లేకుండా ఉండేవి.

ఒక్క వైసీపీ నుండే ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలని లాకున్నారు. ఇద్దరు ఎంపీలని కూడ . ఎందుకింత అనైతికత అనే ప్రశ్న వస్తే.. ”రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా” అనే డైలాగ్ కొట్టారు. ”నా పని తీరుకి ఆకర్షితులై వాళ్ళే వస్తామని అంటే నేను ఎలా ఆపుతాను”అని రివర్స్ డ్రామా ఆడారు. ఇప్పుడు టీడీపీ ఎంపీలు కూడా ఇదే బాటలో బిజెపిలోకి వెళ్లారు. బేసిగ్గా ఇలా వెళ్ళినపుడు జనాల నుండి కొంత సానుభూతి పెరుగుతుంది. కానీ చంద్రబాబు చేసిన తప్పులు, అనుసరించిన విధానాల ద్వార ఇపుడు జనాల్లో ”అయ్యో.. టీడీపీకి ఇలా జరిగిందా?” అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. అందుకే.. పార్టీ అధినేతలు ఒక్క సంగతి గుర్తుపెట్టుకోవాలి. అనైతిక చర్యలు ఎప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వవు.