పంచె సరే.. మరీ గెడ్డెం ఎందుకు పవన్ ?

పొలిటికల్ లీడర్స్ మాస్ లుక్ లో కనిపించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేతలు గెడ్డెం లుక్ తో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన పొలిటికల్ యాత్ర చేపట్టినప్పటి నుంచి గెడ్డెం లుక్ తోనే కనిపిస్తున్నారు. మరీ.. ఆ గెడ్డెం ఎందుకు పెంచుతున్నట్టు ? పరోక్షంగా తాను మోడీ సపోర్టు అంటూ ఆయనలా గెడ్డెంలో కనిపిస్తున్నాడేమో.. ! ఇదీగాక.. ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నాడేమో.. !!

ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్య పవన్ పంచె కట్టుతో కనబడుతున్నాడు. ఇదేంటీ కొత్తగా ? అంటే తాను తెలుగువాడినని చెప్పేందుకే పంచె కడుతున్నానని తెలిపారు. ఆయన తెలుగోడని తెలుగు ప్రజలకు తెలుసు. మరీ.. తెలియాల్సింది ఢిల్లీ ప్రజలకా.. ? అంటే ఆయన ఢిల్లీ వైపు చూస్తున్నారా.. ?? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మనం గెలిచినా.. గెలవకున్నా జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించబోతున్నామని ఇటీవల పార్టీ నేతలతో పవన్ అన్నాడట. బహుశా.. ఆ ఆశతోనే పవన్ పంచె కట్టులో కనిపిస్తున్నాడేమో. చూస్తుంటే.. మోడీ నుంచి పవన్ కు గట్టి హామీనే లభించినట్టుంది.

పంచె సీక్రెట్ విప్పిన పవన్.. ఆ గెడ్డెం సీక్రెట్ కూడా విప్పితే బాగుణ్ను అని ఆయన అభిమానులు అనుకొంటున్నారు. ఆయన్ని ఫాలో అయి గెడ్డెం పెంచితే గులగుల పెడుతుందట పాప. ఇది జస్ట్ జోక్ మరీ.. !