కాళేశ్వరం.. బాబు.. పవన్ మౌనవ్రతం


తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మించుకుంది. దానికి ప్రారంభోత్సవం కూడా ఫిక్స్‌ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుండి సిఎం జగన్ అక్కడి గెస్ట్ గా వెళుతున్నారు. ఇక్కడి వరకూ బావుంది. కానీ ఇందులో బోలెడు రాజకీయం, ప్రజా సమస్య, సెంటిమెంట్లు వున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అక్కడి వెళ్ళడంపై ఏపీ నుండి ఇప్పటివరకూ ఎవరు గట్టిగా వ్యతిరేకించినట్లు కనిపించడం లేదు. అయితే ఎందుకు వ్యతిరేకించాలి అంటే.. ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో వుండగా కాళేశ్వరంని వ్యతిరేకించారు. గోదావరి జలాలు లేకపోతే ఏపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాంటింది ఇప్పుడ రిబ్బన్ కటింగ్ కి వెళుతున్నారు.

మరి దీనికి ఏపీలో వుండే ప్రతిపక్షాలు వ్యతిరేకించావా ? అంటే వ్యతిరేకించలేవు. ఎందుకంటె వాళ్ళకున్న పొలిటికల్ ఇంట్రస్ట్ అలావుంది. చంద్రబాబు కి ఇంకా నమ్మకం తెలంగాణలో టీడీపీని నిలబెడతానని. ఇప్పుడు గానీ ఆయన కాళేశ్వరంకు వ్యతిరేకింగా ఒక్కమాట అన్నా.. వున్న పార్టీ ఆఫీస్ కూడా ఎత్తేయాల్సివస్తుంది. ఆ సంగతి చంద్రబాబు కి బాగా తెలుసు. అందుకే ఆయన సైలంట్ అయిపోయారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దా.. ఈయన గారికి కూడా తెలంగాణపై చాలా ఆశలు వున్నాయి. ఇప్పుడు ఓటమి చూసి ఉండవచ్చు కానీ భవిష్యత్ లో ఇక్కడ జనసేన జెండా ఎగురుతుందని ఆయన గట్టి నమ్మకంతో వున్నారు. అందుకే ఆయన వైపు నుండి కూడా ఎలాంటి కామెంట్లు రావడం లేదు. అయితే కాళేశ్వరం మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన అంశమే. గోదావరి డెల్టా లో నీరు ఖాళీ అయినప్పుడు ఏపీకి ముప్పు తప్పదు. కానీ ఈ పాయింట్ మాట్లాడానికి అటు బాబు గానీ ఇటు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించడం లేదు.