పవన్ నాయుడు .. కొత్త ట్యాగ్


పవన్ కళ్యాణ్ కాపు. కానీ ఆయనకి కమ్మ ట్యాగ్ తగిలించారు మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ని ‘నాయుడు’ అని సంబోదించారు. పవన్ నాయుడని పిలిచారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు పవన్ నాయుడికి కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ ఎన్నికల హామీలను అమలు చేస్తుంటే, పవన్ నాయుడికి ఇసుక తప్ప మరేమీ కనిపించడం లేదని అన్నారు.

చంద్రబాబు చెప్పిన మాటలతోనే పవన్ నాయుడు రోడ్లపైకి వస్తున్నారని ఆరోపించారు. దున్నపోతు ఈనిందని చంద్రబాబు అంటే, దూడను కట్టేస్తానంటూ పవన్ వస్తున్నారని ఎత్తిపొడిచారు. పవన్ నాయుడు అని ఎందుకు అంటున్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, పవన్ నాయకుడికి కు నరనరాన కులతత్వం జీర్ణించుకుపోయిందని, ఎవరో సినిమా రైటర్ రాసిస్తే విమర్శలు చేయడం సరికాదని, ‘పవన్ నాయుడు గారూ, మీరు ఒక్కసారి తాట తీస్తే మీ ఎదుటివాళ్లు పదిసార్లు మీ తాట తీస్తారని’ హెచ్చరించారు నాని.