నాతో సుఖం వుండదు .. అందుకే మూడు పెళ్లిళ్లు

నాకేమీ ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు మూడు పెళ్లిళ్లు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నన్ను వ్యక్తిగతంటార్గెట్ చేస్తున్న వారు క విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘మీ అందరితో పోల్చుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది. మీలాగా నా జీవితాన్ని దాయను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి.. చీదరించుకుంటే చీదరించుకో.. నేను దాయను.’ అన్నారు.

‘నాకేమీ ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు. నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. ‘వీడెప్పుడూ బయట వాళ్ల కోసం ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ కేమైంది.. వీళ్ల కేమైంది..అక్కడ రోడ్డు కూలిపోయిందంట’ అని నేను రోజూ ఏడుస్తా ఉంటే పక్కన వాళ్లకు సుఖమేముంటుంది? అందరూ, నన్ను ‘సినిమా యాక్టర్’ అని అనుకుంటారు. ఓ చిన్న గదిలో ఓ మూల కూర్చుని నేను పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాను. నా జీవితంలో పార్టీలు ఉండవు.. పబ్స్ ఉండవు. ఆవుల దగ్గరో, గేదెల దగ్గరో లేకపోతో ఎవరో ఒకళ్లతో మాట్లాడుతూ ఉంటాడు.. వాడితో సుఖమేముంటుంది? ఎప్పుడూ ఒత్తిడి. అందుకు, నా వ్యక్తిగత జీవితం ఛిన్నాభిన్నమైపోయింది. నేను ఏడ్చాను, ఇబ్బందిపడ్డాను’ అని వివరించారు పవన్.