ఫ్యాక్షన్ రాజకీయాలకు రెడీ: పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనపై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై నిప్పులు చెరిగారు.

“జగన్ రెడ్డి గారూ మీరు చాలా చిల్లరగా మాట్లాడుతున్నారు. సీఎం హోదాకు తగ్గట్టు హుందాగా మాట్లాడడం నేర్చుకోండి. ఎన్నికల ప్రచారంలో ఎలాగూ చిల్లరగా మాట్లాడారు. మీ స్థాయి అది. కానీ మేం మీలాగా కాదు, మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. భాషా సంస్కారాలు మర్చిపోయి మీరు ఎంత హీనంగా మాట్లాడినా మేం మా స్థాయికి దిగజారి మాట్లాడం. కచ్చితంగా పాలసీ విధానాలపైనే స్పందిస్తాం తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లం. అలా కాదు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానంటే నేను రెడీ. విజయవాడ నడిబొడ్డున తేల్చుకుందాం” అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్య చేశారు పవన్.