ఇంగీష్ మీడియం: జనసేన ఈ ఓవర్ యాక్షన్ అవసరమా ?


ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైమరీ స్కూల్ విద్యకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటవ తరగతి నుంచి తెలుగు మీడియం తొలగించాలని, ఇంగ్లీష్ మీడియంలోనే విద్యని అభ్యసించాలని నిర్ణయించారు. కాగా ఈ వ్యవహరం రాజకీయ రంగు పులుపుకుంది. దీనికి టీడీపీ, జనసేన దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అమ్మలాంటి తెలుగు భాషకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

అయితే ఈ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే.. జగన్ తీసుకున్న నిర్ణయం విద్యార్ధుల భవిష్యత్ కు బంగారు బాటలు వేసే నిర్ణయమే అని చెప్పకతప్పదు.

తెలుగు భాష గొప్పది. ఎవరు కాదన్నారు.?! అయితే ప్రపంచ పొగడలు మారిపోయాయి. ఇంగ్లీష్ తప్పనిసరైయింది. ఇప్పుడు ఇంగ్లీష్ కేవలం భాష కాదు.. బ్రతకడానికి బరోసా. ఇంగ్లీష్ రాకుండా ప్రపంచంలోకి రావడం అంటే ఆయుధం లేకుండా యుద్ధం చేయడం లాంటింది. అలాంటి యుద్ధంలో గెలవడం కష్టం. ఈ సంగతి తమ పిల్లల్ని Oakridge International Schools ల చదివించే పవన్ కళ్యాణ్ కి అర్ధం కాకపోవచ్చు. వాళ్ళకి సునాయాసంగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది.

కానీ వీధి బడిలో కూర్చుని చదివే ఓ పిల్లాడికి ఇంగ్లీష్ అంటే గగనం. మరోలా చెప్పాలంటే ఇంగ్లీష్ రాని బతకు ఓ అంగవైకల్యం. నోరు వుండి కూడా మాటరాని తనం. వీధి బడిలో చదువుకునే ప్రతి పిల్లాడు ఎదురుకుంటున్న సమస్య ఇది.

ప్రపంచంతో కమ్యునికేట్ చేయాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. చిన్నప్పటి నుండే ఇంగ్లీష్ నేర్పించడం వల్ల.. మిగతా విద్యార్థులతో ఇంగ్లీషులో మాట్లాడి.. భాషాపరమైన కాన్ఫిడెన్స్ పెంచుకునే అవకాశం వుంది. ఏపీ సిఏం జగన్ మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే అలోచించారు. ప్రతి పిల్లాడిలో ఆ కాన్ఫిడెన్స్ నింపాలని అనుకున్నారు. ఇంగ్లీష్ అనే ఆయుధంతో ఈ పోటీ ప్రపంచంలోకి పపించాలని తలచారు. ఈ నిర్ణయం ముమ్మాటికీ సమర్ధనీయం.

అయితే ఇక్కడ తెలుగు భాష గురించి తెగ ఫీలైపోతున్న పవన్ కళ్యాణ్ లాంటి జనాలు ఒక్క విషయం అలోచించుకొవాలి. కేవలం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు తెలుగు చదవనంత మాత్రానా తెలుగు ఏం ఆగిపోదు. ఇంటర్నెట్ ని అంతర్జాలమని, పేస్ బుక్ ని ముఖ పుస్తకమని రాసినంత మాత్రానా తెలుగు నిలబడిపోదు. పైగా నవ్వులపాలౌతుంది. తెలుగుని నిలబెట్టాలంటే తెలుగుదనం అంటే ఏంటో పిల్లలకి చెప్పాలి. సాహిత్యాని పరిచయం చేయాలి. దీనికి తెలుగులో చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. అంతేకానీ.. ఒక భాషని రుద్ది పిల్లల్లో కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడం ముమ్మాటికీ ఒక వైఫల్యమే. ఈ విషయంలో ఏపీ సిఏం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా వుంది.