అధికారం లోకి వస్తే పవన్ మొదటి సంతకం దానిపైనేనట…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కవాతు ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాంగా ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సీపీఎస్‌ రద్దుపైనే చేస్తానని సభ ముఖంగా స్పష్టం చేశారు. అలాగే అధికార పార్టీ తెలుగు దేశం , ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.

పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన సత్తా ఏమిటో చూపిస్తామని పవన్‌ స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని , ఎన్నికలు నిర్వహించకుంటే మాజీ సర్పంచ్‌లతో ఉద్యమం చేస్తామని పవన్‌ తెలిపాడు. ప్రతిపక్ష నేత జగన్‌ను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా బెదిరింపులు, దోపిడీలు ఎక్కువైపోయాయని అన్నారు. ఈ పద్దతి మారాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019 ఎన్నికలు చాలా కీలకమైనవని, పద్దతులు మార్చుకోకపోతే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. అది చంద్రబాబు అయినా.. ప్రతిపక్ష నేత జగన్ అయినా సరే అన్నారు. గుండాగిరి, ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరన్నారు. యువత తిరగబడితే తరువాత ఎదురయ్యే పర్యవసానాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలే బాధ్యత వహించాలన్నారు.

ఇక జనసేన కార్య కర్తల గురించి అలాగే అభిమానుల గురించి చాల గొప్పగా మాట్లాడారు..జనసేన కవాతుకు తరలివచ్చిన లక్షలాది మంది జనసైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు అని , అవినీతి వ్యవస్థను ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జనసైనికులు. కలల ఖనిజాలతో చేసిన యువకులు నా జనసైనికులు. తల్లి భారతమాతకు ముద్దు బిడ్డలు నా జనసైనికులు’ అంటూ పవన్ ఉద్వేగభరితంగా అన్నారు.