స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ‘ఆయుష్మాన్‌ భారత్‌’

72వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా భారత దేశ ప్రజలకు తీపి కబురు అందించాడు ప్రధాని మోదీ. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఈరోజు ప్రకటించనున్నారు. ‘ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఏబీఎన్‌హెచ్‌పీఎస్)’ పేరుతో ప్రారంభమయ్యే ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పధకం ప్రధాన ఉద్దేశ్యం పేద ప్రజలకు ఆరోగ్య సంరక్షణే.

‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ఎంపిక చేసిన ప్రతి కుటుంబానికి వార్షికంగా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. దీనిద్వారా సుమారు పదికోట్ల కుటుంబాలకు (40 – 50 కోట్ల మందికి) లబ్ధి చేకూరనుంది. 8.03 కోట్ల గ్రామీణ, 2.33 కోట్ల పట్టణ పేదలకు ఈ బీమా సౌకర్యాన్ని అందించనున్నారు. మొదట ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించనున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు.