ఇది విన్నారా.. ? మోడీకి కారు కూడా లేదు !!


చెవుల్లో పువ్వులు, బండరాళ్లు.. ఇంకేమైన పెట్టడంలో రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. ఇప్పుడీ లిస్టులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేరిపోయాడని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొంటున్నారు. ఇంతకీ మోడీ పెట్టిన ఆ పువ్వేంటో తెలుసా.. ? మోదీ పేరుపై కనీసం సొంత కారు కూడా లేదట. ఛాయ్‌వాలాగా జీవితాన్ని ఆరంభించి ప్రధానమంత్రిగా ఎదిగారు నరేంద్రమోదీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు.

ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీ కూడబెట్టుకున్న ఆస్తులు ఎంతో తెలుసా.. ? అక్షరాలా రూ.2.28కోట్లు. అయినా కనీసం సొంత కారు కూడా లేదట. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వీటి ప్రకారం.. మార్చి 31, 2018 నాటికి ప్రధాని మోదీ చేతిలో ఉన్న డబ్బు రూ. 48,944. ఇక ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 2.28కోట్లు. ఇందులో రూ. 1.28కోట్లు చరాస్థులు కాగా.. గాంధీనగర్‌లోని మోదీ నివాస స్థలం విలువ రూ. కోటి.