రాహుల్ తెలంగాణ టూర్ హైలైట్స్…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న శేరిలింగంపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో హాజరయ్యారు. సభలో కేంద్రంలో ఉన్న బీజీపీ ప్రభుత్వాన్ని , అలాగే తెలంగాణ రాష్ట్రంలో అధికారం లో ఉన్న తెరాస పార్టీ ఫై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరు ఒకేలా ఉందని ఆయన అన్నారు. నేను ప్రధానిని కాదు.. కాపాలాదారుడి అని చెప్పిన ప్రధాని రాఫెల్ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. యూపీఏ హయాంలో హెచ్‌ఏఎల్‌కు రాఫెల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చాం. మోదీ ఫ్రాన్స్‌ వెళ్లి అనిల్‌ అంబానీకి సదరు కాంట్రాక్ట్‌ అప్పగించారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్‌ విమానాల ధరలు చెప్పలేమని, ఈ విషయంలో రహస్య ఒప్పందం ఉందని రక్షణ మంత్రి అంటున్నారు.

ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మోదీ అంటే.. తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్‌ ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని అసత్య వాగ్దానాలే చేశారని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీలానే కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని, ఇక్కడ ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉందని అన్నారు. దళితులకు మూడు ఎకరాలు, 22 లక్షల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హమీ ఇచ్చారు. ఇంత వరకు నెరవేర్చలేదు. ఇంటికో ఉద్యోగమని చెప్పి, నాలుగున్నరేళ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీకి టీఆర్ఎస్ ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు.