రజనీ- బిజెపి–ఫార్ముల హిట్ అవుతుందా ?


నాయకులని తయారు చేయడం కంటే కొనుక్కోవడం తేలిక. బిజెపి ఇప్పుడు అదే పని చేస్తోంది. తమ బలం లేని చోట, స్వయంగా ఎదగడానికి ఏళ్ళు పట్టే చోట .. ఇంక నాయకత్వం డెవలప్ చేయలేమని ఫిక్స్ అయిన చోట్ల .. అక్కడ బలంగా వుండే నాయకులకు గాలం వేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఆ పని మొదలుపెట్టింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బిజెపిలో కొత్త ఆశలు చిగురించాయి. ఇంక తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత తామే సెకండ్ ఆప్షన్ గా ఎదగాలని వ్యూహా రచన చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ , టీఆర్ఎస్ అసంతృప్తి నేతలని లాక్కొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. బిజెపి లో చేరికపై అటు నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్రంలో వున్న బిజెపితో కొనసాగితే.. రాజకీయంగా ఇంకో ఐదేళ్లు ఎలాంటి చిక్కులు వుండవని భావిస్తున్నారు.

ఇప్పుడు బిజెపి చూపు తమిళనాడుపై కూడా పడింది. ఇక్కడ బిజెపి బలం గురించి తెలిసిందే. మరో పది దశాబ్దాల వేచి చుసిన అధికారం దక్కించుకోలేని పరిస్థితి. అందుకే ఓ నాయకుడిని కొనుక్కొని రాజకీయం చేయాలనీ చూస్తోంది. ఆ నాయకుడు రజనీకాంత్. రజనీ అండతో అక్కడ పగా వేయాలని చూస్తోంది బిజెపి. ఈ మేరకు ఇప్పటికే పావులు కదిపింది. ఐతే రజనీ బిజెపి గాలాని ఎంత వరకూ చిక్కుతారో అన్నది ఇక్కడ ప్రశ్న. రజనీ కాషాయ జెండా పట్టుకుంటే అక్కడ ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి? బిజెపి తో చేతులు కలపడాన్ని తమిళ తంబీలు స్వాగతిస్తారా ? ఇవన్నీ కాలం చెప్పాల్సిన సమాధానాలు.