పవన్ స్నేహితుడు మళ్ళీ కనిపించాడు

రాజు రవితేజ… పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టిన రోజున వెలుగులోకి వచ్చిన పేరిది. నా వెనుక ఎవరూ లేరు. ఒక్క రాజు రవితేజ తప్పా”అని స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది.

అసలు ఎవరీ రాజు రవితేజ… పవన్ కళ్యాణ్ కి ఎన్నో పరిచయాలు, ఎంతో మంది సలహాదారులు ఉండగా రాజు రవితేజనే ఎంచుకోవడానికి కారణమేమిటి.. ఇలా చాల చర్చలు జరిగాయి. ఆలోచన, పరిశీలన, అనుభవం మూలసూత్రాలుగా తన ఫిలాసఫీని నిర్మించుకున్న రాజు రవితేజకు సమాజం, రాజకీయాలు, యువ చైతన్యం అంశాలపై నిర్థిష్ట సూత్రాలు వున్నాయని అప్పట్లో చెప్పుకున్నారు.

అయితే తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ కు దూరం అయ్యాడని కూడా వినిపించింది. జనసేన తర్వాత కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు అయితే ఎట్టకేలకు మళ్ళీ పవన్ తో కలసి కనిపించాడు రాజు రవితేజ. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రూపాంతర దేవాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెంట రాజు రవితేజ కనిపించాడు.