ఆర్టీసి ఉద్యమం, లైట్ తీసుకున్న ప్రజలు !


ఒక ఉద్యమం సక్సెస్ కావాలంటే ఆ ఉద్యమానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అది ప్రజా ఉద్యమం అయ్యిండాలి. డిమాండ్లు ప్రజల నుండి రావాలి. భాద, ఆవేదన సామాన్య ప్రజలది కావాలి. అప్పుడే ఆ ఉద్యమానికి విజయం. ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసి ఉద్యమించింది. ఇది కొత్త కాదు. పేపర్లు చదివే అలవాటు వున్న ఎవ్వరికైనా ఆర్టీసి ఉద్యమం వెరీ కామన్. ఏడాదికి నాలుగైదు సార్లు ఉద్యమిస్తుంటారు. అయితే ఈసారి కొంచెం గట్టిగా వుంది ఉద్యమం. ఆర్టీసి వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ ఉద్యమానికి ప్రతిపక్ష రాజకీయ నాయకులు రియాక్ట్ అవుతున్నంత సీరియస్ గా ప్రజలు రియాక్ట్ కావడం లేదు. ఆర్టీసి వల్ల మాకు ఇబ్బందులు వున్నయాని ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టుకొని ఊరుకోవడం తప్పితే .. సామాన్యులు ఆర్టీసికి మద్దత్తుగా ముందుకు రావడం లేదనేది అంగీకరించాల్సిన నిజం.

అందుకే ఈ ఉద్యమం కేవలం ఆర్టీసి, ప్రభుత్వానికి మధ్య వుందని చెప్పాల్సివస్తుంది. అది కూడా కాదు. సిఏం కేసీఆర్ తనదైన రాజకీయంతో ఈ వుద్యమాన్ని ఇంకా డౌన్ చేసి పారేశారు. ”ఆర్టీసి ఉద్యోగులు మంచోళ్ళు. యూనియన్ లీడర్ల లొల్లిది” అంటూ బౌన్సర్ వేశారు. ఈ మాటతో ఆర్టీసి సమ్మెలో పాల్గొంటున్న చాలా మంది ఉద్యోగులు డైలామలో పడ్డారు. సమ్మె ఇంకా కొనసాగుతుంది. అయితే ఇది కేవలం ఆర్టీసి బాధ గానే వుంది. సామాన్య ప్రజలు ఎప్పుడైతే రోడ్లపైకి వస్తారో అప్పుడే ఈ ఉద్యమం విజయతీరాలకి చేరుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ప్రజల మద్దత్తు కూడబెట్టుకోవడానికి ఆర్టీసి దగ్గర వున్న ప్రణాళిక ఏమిటో చూడాలి.