హైదరాబాద్ వచ్చిన బాబుకి జగన్ షాక్

విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పుడే షాక్ తగిలింది. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. జెడ్‌ కేటగిరీ ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్‌కు భద్రత తగ్గించి 2+2 గన్‌మెన్లను కేటాయించారు. మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు.

కాగ కనీస సమాచారం ఇవ్వకుండా.. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రత తగ్గించడంపై పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇదీలా వుంటే.. రేపు అమరావతికి వెళ్లనున్నారు బాబు. తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఈ మీటింగ్ కి పలు జిల్లాల నుండి నాయకులు హాజరు కానున్నారు.