పార్టీ సుప్రీం మళ్ళీ సోనియానే నా…?

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేదు. ఈ లోపు రాహుల్ రాజీనామా తో అది ఇంకాస్త సంక్లిష్టంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 52 స్ధానాలకు పరిమితం కావడం, ఏకంగా పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ దుస్ధితికి అద్దం పడుతోంది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండటంతో మరోసారి సోనియానే బాధ్యతలు చేపట్టాలని సీనియర్లు కోరుతున్నారు.

 

2017 డిసెంబర్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ముందు దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగారు. పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలు తీసుకున్న సోనియా పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు.ఇక పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ తరుణంలో తమ కుమారుడి నుంచి సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను తిరిగి అందుకోవాలని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు కోరుతున్నారు.