జనసేన గెలుపు సీట్ల లెక్క చెప్పిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే అనుకోండి..కాస్టింగ్ కౌచ్ పేరిట వార్తల్లో నిలిచిన ఈమె, ఆ తర్వాత ఎలాంటి సంచలన కామెంట్స్ చేసిందో..ఎటు నుండి ఎటు వెళ్లిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక మొదటి నుండి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈమె తాజాగా మరోసారి జనసేన గెలుపు సీట్ల ఫై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

తాజాగా హైదరాబాద్ లో ఒక బేకరీని ఓపెన్ చేయటానికి వచ్చిన ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ..తనను రెండు రాజకీయ పార్టీలు రమ్మని కోరుతున్నాయని.. కానీ తనకు ఇప్పటికైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ జనసేన కు ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పడం కోసం మెరుపు.

ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ జనసేనకు ఘోర పరాజయం తప్పదని , కేవలం మూడు.. లేదంటే నాలుగు సీట్లలో మాత్రమే పవన్ పార్టీ గెలుస్తుందని.. మిగిలినచోట్ల ఓడిపోవటం ఖాయమని తెలిపింది. ఈమె మాటలను విన్న అభిమానులు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపిన శ్రీ రెడ్డి జనసేన సీట్ల ఫై ఎలా మాట్లాడిందని కామెంట్స్ వేస్తున్నారు.