వచ్చే ఏడాది నుండి గవర్నమెంట్ టీచర్లకు చుక్కలే..

ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం టీచర్ జాబ్ కే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు…ప్రభుత్వం స్కూల్ టీచర్ గా అయితే ఏ ఇబ్బంది ఉండదని..ఏం చేసిన..ఏ టైం కు వెళ్లిన పెద్దగా ఇబ్బంది ఉండదని అంత భావిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆలా కాదు అన్ని మారిపోయాయి..మారుస్తూవస్తున్నారు ప్రభుత్వం. ఇక వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు చుక్కలే..ఎందుకంటే అన్ని పాఠశాలలో బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకరాబోతున్నారు.

ప్రస్తుతం ఈ విధానం 12 జిల్లాల్లో విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే వీరి అటెండెన్స్ చక్కగా పెరగడంతో ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో వాడాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు విధానం అమల్లోకి రానుంది. దీనిపై త్వరలో అధికారులు సమావేశమై చర్చించనున్నారు.