నాకు ఎప్పుడు పవన్ కల్యాణే దేవుడు – బండ్ల గణేష్

సినీనటుడు & బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈరోజు రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ మరోసారి పవన్ కళ్యాణ్ ను దేవుడి తో పోల్చడం అభిమానుల్లో సంతోషం నింపింది. పవన్ కళ్యాణ్ అంటే గణేష్ కు ఎంత ఇష్టమో చాల సార్లు వేదికల ఫై విన్నాం..చూసాం. అయితే మొన్నటి వరకు గణేష్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరతాడని అంత అనుకున్నారు. కానీ గణేష్ మాత్రం ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని అందరికి షాక్ ఇచ్చాడు.

‘నేను చిన్నప్పటి నుంచీ కాంగ్రెస్‌ వాదినే. పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీకి అధినేత అయినాసరే, నాకు కాంగ్రెస్‌ పార్టీ అంటే ఇష్టం కాబట్టే కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ పవన్‌కళ్యాణ్‌ నాకు దేవుడే. ఇందులో ఎలాంటి మార్పూలేదు..’ అంటూ చెప్పాడు. మీరు కాంగ్రెస్ పార్టీ లో చేరారు కదా..ఒకవేళ పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శించాల్సి వస్తేనో.? అని మీడియా అడుగగా ‘ఛస్తే విమర్శించను..’ అని గణేష్ చెప్పి పవన్ ఫై ఉన్న అభిమానాన్ని ఢిల్లీ లెవల్లో చెప్పి మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు.

చిత్ర నిర్మాణ రంగంలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గుర్తింపు తెచ్చుకున్న గణేష్ రాజకీయాల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.