మున్సిపల్ ఫలితాల ఫై కవిత ఏమంటుందంటే..

ముందు నుండి అంత భావించినట్లే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆరఎస్ హావ చూపించింది.. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 100కు పైగా స్థానాలు గెలిచి మరోసారి సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో బిజెపి , కాంగ్రెస్ అడ్రెస్ లేకుండా పోయాయి.

ఈ ఫలితాలపై టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆనందం వ్యక్తం చేసింది. భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జై తెలంగాణ! జై టీఆర్‌ఎస్! జై కేసీఆర్! అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇక కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. ఎంఐఎం పార్టీ భైంసా, జల్ పల్లి మున్సిపాలిటీల్లో గెలిచింది. తుక్కుగూడ, ఆమన్ గల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీల్లో గెలువగా.. మరో రెండు మున్సిపాలిటీల్లో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది.