సీఎం వార్తల ఫై కేటీఆర్ స్పందన..

తెలంగాణ రాష్ట్రానికి అతి త్వరలో కేటీఆర్ ముఖ్య మంత్రి కాబోతున్నాడని..మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని భావిస్తున్న ఆ పార్టీ వర్గాలు… ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలో వేసి… ఆయన్ను సీఎం కుర్చీ ఎక్కించబోతున్నారనే ప్రచారం వైరల్ కావడం తో కేటీఆర్ ఈ వార్తల ఫై స్పందించారు.

తాను సీఎం అవుతానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. మీడియాలోనే ఈ ప్రచారం జరుగుతోందని.. మంత్రులతోనూ మీడియా వాళ్లే మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ ఎన్నికలు తనకు సవాలు లాంటివని చెప్పారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు.