జగన్ పాలన గురించి కేటీఆర్ ఏమన్నాడంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు జగన్. కేవలం ఏపీ ప్రజలను మాత్రమే కాదు రాజకీయ వర్గాల్లో కూడా జగన్ పనితీరు కు ఫిదా అయ్యారు. తాజాగా కేటీఆర్ సైతం జగన్ పాలన ఫై ట్వీట్ చేసారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విటర్ ద్వారా నెటిజన్లతో టచ్‌లో కేటీఆర్ ఉంటాడనే సంగతి తెలిసందే. తాజాగా ఒక నెటిజన్ జగన్ ఆరు నెలల పాలన ఎలా ఉందో ఒక్క పదంలో చెప్పాలంటూ కేటీఆర్ కు ప్రశ్న వేశారు.

దీనికి కేటీఆర్..సీఎం జగన్ తొలి ఆరునెలల పాలన బాగుందని కితాబిచ్చారు. జగన్ పాలన బాగానే ఉందని తాను భావిస్తున్నానని కామెంట్ చేశారు. ‘‘ ఐ తింక్ హీ స్టార్టెడ్ ఆఫ్ వెల్’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఒక్క పదంలో జగన్ పాలన బాగుందని జవాబిచ్చారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై నెటిజన్ ప్రశ్నలకు అది ఏపీ ప్రజలు నిర్ణయించాల్సిన విషయమని.. తాను కాదని సమాధానమిచ్చారు. అలాగే మరో నెటిజన్ మీరు సినిమాల్లో నటిస్తారా? ఒకవేళ మీరు నటిస్తే ఒక మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని మేం ఆశిస్తాం.. అని అడుగగా..దానికి కేటీఆర్ .థ్యాంక్స్, నాకు ఫుల్ టైం జాబ్ ఉంది అంటూ సమాధానం ఇచ్చారు.