తెలంగాణ కొత్త మంత్రుల్లో ఛాంబర్ గొడవలు..

తాజాగా తెలంగాణ మంత్రి వర్గం పూర్తి చేసారు ముఖ్యమంత్రి కేసీఆర్. శాసన సభ ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులకు మంత్రివర్గంలో స్థానం కలిపించారు. పదిమందికి రాష్ట్ర శాఖలు కేటాయించారు. ఇక ఇప్పుడు ఆ మంత్రులకు కొత్త సమస్య ఏర్పడినట్లు తెలుస్తుంది. సాధారణంగా సెంటిమెంట్ ను చాలామంది ఫాలో అవుతారు..ఫలానా రోజు కొత్త పనిని ప్రారంభిస్తే అంత మంచే జరుగుతుందని , లేదా ఆ స్థానంలో ఉంటె లాభం చేకూరుతుందని ఇలా అందరూ కొన్ని సెంటిమెంట్లను ఎక్కువగా పాటిస్తుంటారు.

తాజాగా మంత్రిగా ప్రమాణం చేసిన వారు… తమ చాంబర్ల ఎంపిక విషయంలో ఇలాంటి సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తి కావడంతో ప్రభుత్వం మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది. సచివాలయంలోని డి బ్లాక్‌లో ఉన్న మూడు అంతస్తుల్లో కొత్త మంత్రులకు చాంబర్లను కేటాయించారు. గతంలో మంత్రి హరీశ్ రావు వినియోగించిన చాంబర్‌ను కొత్తగా మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించారు. అయితే గతంలో హోంమంత్రిగా వ్యవహరించిన నాయిని నర్సింహారెడ్డి చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కార్మిక శాఖ మల్లారెడ్డి తో మరో మంత్రి నాయిని ఛాంబర్ అడుగుతున్నారట. దీంతో మల్లారెడ్డి చాంబర్ అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరి చివరకు ఆ ఛాంబర్ ఎవరికీ దక్కుతుందో చూడాలి. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలంతా గుడి బాట పట్టారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు క్యూ కట్టారు.

తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తోమాల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగాయకుల మండపంలో శ్రీనివాస్ గౌడ్ కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు.