సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో పలు కీలక అంశాల గురించి మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ పనితీరు వంటి అనేక అంశాల మీద కూలంకషంగా చర్చించామని, ఈ మేరకు 9 తీర్మానాలు కూడా ఆమోదించామని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వంద సీట్లకు పైగా గెల్చుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి ప్రగతి సభ అని నామకరణం చేశామన్నారు. ఆ బహిరంగ సభకు 20 లక్షల మందిని తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా రూ. 20 వేల కోట్ల నిధులైనా కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు చెప్పారు. వరి, మొక్కజొన్న పంటల మద్దతు ధరను క్విటాలుకు రూ. 2 వేలు పెంచాలన్నారు. సెప్టెంబర్ నుంచి దశలవారీగా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. తాను ఫెడరల్ ఫ్రంట్ విషయంలో చాలా క్లారిటీ కలిగి ఉన్నాని చెప్పారు. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా విఫలమయ్యారన్నారు. ఒకటి, రెండు పార్టీలను పోగేసి ప్రయోజనాలు నెరవేర్చుకునే చేసి చిల్లర రాజకీయాలు తాను చేయడం లేదన్నారు.