తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి భారీగా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వెయ్యి లోపే కేసులు నమోదు అవుతూ ప్రజల్లో సంతోషం నింపుతున్నాయి. తాజాగా విడుదలైన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 565 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2,70,883 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 2,60,155 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 9,266 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 1462 మంది కరోనాతో మృతి చెందారు.