పవన్’కు వీహెచ్ సూచన

గత ఎన్నికల ముందుకు ‘జనసేన పార్టీ’ని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. భాజాపా – టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు. ఐతే, ఈసారి జనసేన ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. ఐతే, జనసేన తెలంగాణలో పోటీ చేసే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పవన్ కి ఓ సూచన చేశారు.

తమ బతుకు తాము బతుకుతాం. తెలంగాణలో జనసేన పోటీ చేయరాదని పవన్ కి సూచించారు వీహెచ్. మరీ వీహెచ్ సూచనని పవన్ పాటిస్తారో లేదో చూడాలి. ఇప్పటి వరకు పవన్ తెలంగాణపై పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనబడటం లేదు. ఒకవేళ పవన్ ఇక్కడ పోటీ చేసిన.. ఆయన ఫైనల్ గా టీఆర్ ఎస్ కి మద్దతు ఇచ్చేలా కనబడుతోంది.