జగన్ కు షాక్ : జనసేనలో చేరిన వైసీపీ ముఖ్య నేత..

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన బలం రోజు రోజుకు పెరుగుతుంది..సినిమాలు వదిలేసి పూర్తి గా రాజకీయాల్లోకి పవన్ రావడం తో అందరిలో నమ్మకం పెరిగిపోతుంది. ఈ క్రమం లో మొన్నటివరకు జనసేన లో చేరాలా..వద్దా అని ఆలోచించిన వారంత ఇప్పుడు జనసేన కండువా కప్పుకుంటూ పార్టీ లో తమ సత్తాను చాటేందుకు ముందు పడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ రాజకీయ నేతలు జనసేన పార్టీ లో జాయిన్ అవ్వగా , తాజాగా వైసీపీ పార్టీ కి చెందిన ముఖ్య నేత చేరడం జనసేన కు మరింత బలంగా మారింది.

తణుకు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత విడివాడ రామ చంద్రరావు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రామచంద్రరావు గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున టిక్కెట్‌ ఆశించారు. టికెట్ వస్తుందనే నమ్మకం తో నియోజక వర్గంలో విస్తృతంగా తిరిగారు. తరువాత టిక్కెట్‌ దక్కకపోవడం, పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో ఆ పార్టీకి దూరమై ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా జనసేన పార్టీ లో టికెట్ ఇస్తామని చెప్పడం తో ఆయన పార్టీ లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెరచాటునున్న విడివాడ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

విడివాడ రాకతో నియోజకవర్గంలో జనసేన బలోపేతం అవుతుందని అనుకుంటున్నారు. తణుకు పట్టణం, అత్తిలి, ఇరగవరం మండలాల్లో కూడా కొంతమంది నాయకులు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.