కరోనా కు వైసీపీ ఎంపీ మృతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజు వేలకొద్దీ కేసులు , పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కరోనా మహమ్మారి దెబ్బకు తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా తో బాధపడుతున్నఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతుండగా బుధువారం సాయంత్రం తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

బల్లి దుర్గాప్రసాద్‌ 28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. దుర్గాప్రసాద్‌ మృతి పట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.