రివ్యూ : 118 – సస్పెన్స్ ‘కల’

స్టార్ కాస్ట్ : నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదా థామ‌స్ తదితరులు..
దర్శకత్వం : కె.వి.గుహ‌న్‌
నిర్మాతలు: మహేష్ కోనేరు
మ్యూజిక్ : శేఖ‌ర్ చంద్ర‌
విడుదల తేది : మార్చి 01, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : 118 – సస్పెన్స్ ‘కల’

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం 118 . ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్..ఈ చిత్ర కథ చాల కొత్తగా విభిన్నంగా ఉండడం తో వెంటనే ఒకే చేసారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు ఎలా కలిసొచ్చింది..? ప్లాపులకు చెక్ పెట్టిందా..లేదా..? తన కెమెరా పనితనాన్ని చూపించిన గుహన్..డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా…లేదా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

గౌతమ్‌ (కళ్యాణ్ రామ్ ) ఓ టీవీ జర్నలిస్ట్‌ గా పనిచేస్తుంటాడు..ఓ రోజు ఓ రిసార్ట్ లో 118 అనే రూమ్‌లో స్టే చేస్తాడు. ఆలా స్టే చేసిన గౌతమ్ కు ఓ కల వస్తుంది. ఆ కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్‌) కనిపిస్తుంటుంది. కొంతమంది రౌడీ లు ఆమెను చంపాలనుకోవడం, ఓ కారుని లోయలోకి తోసేయడం లాంటి ఘటనలు ఆ కలలో వస్తాయి.

ఆ తర్వాత తన జీవితంలో అలాంటి ఘటనలే జరుగుతాయి..లోయలో కారు పడడం..కొంతమంది రౌడీ లు తారసపడడం జరగడం తో కలలో వచ్చిన ఆ అమ్మాయి కూడా కనిపిస్తుందని అనుకుంటాడు. ఆలా గౌతమ్ ఆ అమ్మాయి కోసం వెతకడం మొదలు పెడతాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా..? ఉంటె అమ్మాయి ఎవరు..? ఆమెకు రౌడీ లకు సంబంధం ఏంటి..? మేఘ (షాలినీ పాండే) , గౌతమ్ కు సంబంధం ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* నటి నటుల యాక్టింగ్

* నేపధ్య సంగీతం

మైనస్ :

* సెకండ్ హాఫ్

* లాజిక్‌ లేని సీన్స్‌

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* విభిన్న కథలను ఎక్కువగా ఇష్టపడే కళ్యాణ్ రామ్..ఈసారి కూడా అలాంటి కథే ఎంచుకున్నాడు. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. స్టైలిష్‌ పాత్రలో సహజంగా నటించి మెప్పించాడు.

* నివేదా థామస్.. సినిమా అంత తన చుట్టే తిరిగిన సినిమాలో కనిపించింది మాత్రం చాల తక్కువ. ఉన్న కాసేపైనా తన నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

* షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది.

* ప్రభాస్‌ శీను నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. రాజీవ్‌ కనకాల, ‘ఛమక్‌’ చంద్ర, నాజర్‌ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

సాంకేతిక విభాగం :

* శేఖర్‌ చంద్ర నేపధ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది..సినిమాలో ఉన్నది ఒకే సాంగ్ కావడం తో ఆయన మ్యూజిక్ కన్నా నేపధ్య సంగీతం పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

* ఇక సినిమా ఫొటోగ్రఫీ విషయానికి వస్తే స్వతహాగా గుహన్ మంచి సినిమా ఫోటోగ్రాఫర్ కావడం తో తాను మొదటిసారి డైరెక్ట్ చేసిన చిత్రం కావడం తో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని శభాష్ అనిపించాడు. కెమెరా పనితనం లో ఎలాంటి వంక పెట్టకుండా బాగా చూపించారు.

* ఇక డైరెక్షన్ విషయానికి వస్తే..తాను రాసుకున్న కథ బాగుంది..కలలో వచ్చిన ఘటనలే కళ్ల ఎదురు జరుగుతుండడం తో ప్రతి క్షణం ఏమవుతుందని సస్పెన్స్ కొనసాగించి ప్రేక్షకుల్లో టెన్షన్ నింపారు. ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో సినిమాను మొదలు పెట్టిన గుహన్.. ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు.

అనవసరమైన సన్నివేశాల జోలికి వెళ్లకుండా తాను రాసుకున్నట్లే సినిమానంత ఓకె మూడ్‌లో తీసుకెళ్లి సక్సెస్ అయ్యాడు. ఫస్ట్‌ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ సీన్స్‌తో నడిపించిన గుహన్..సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను మిస్ అయ్యాడు. లాజిక్ ల సంగతి పక్కన పెడితే సస్పన్స్ క్రైమ్ థిల్లర్ గా సినిమాను మలిచి సక్సెస్ అయ్యాడు.. మరి ప్రేక్షకులు ఈ సస్పన్స్ ను ఎలా ఆదరిస్తారనేది చూడాలి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review