2.ఓ రివ్యూ..విజువ‌ల్ వండ‌ర్‌

స్టార్ కాస్ట్ : రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ తదితరులు..
దర్శకత్వం : శంకర్
నిర్మాతలు: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
మ్యూజిక్ : ఏ ఆర్ రహమాన్
విడుదల తేది : నవంబర్ 29, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : 2.ఓ విజువ‌ల్ వండ‌ర్‌

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 2.ఓ. సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ మూవీ ఈరోజు (నవంబర్ 29 ) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీఫై అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఈ సినిమాకోసం శంకర్, రజనీ, అక్షయ్ ఎంత కష్టపడ్డారో మనం మేకింగ్ వీడియోస్ లలోనే చూసాం. మరి వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందా..? అసలు చిట్టి రీలోడెడ్‌ ఎందుకు అవ్వాల్సి వచ్చింది..? చిట్టి కి, పక్షిరాజు (అక్షయ్) కి సంబంధం ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఉన్నట్టుండి అందరి చేతుల్లో నుండి సెల్ ఫోన్స్ ఆకాశంలోకి వెళ్తుంటాయి..ఎంత గట్టిగా పట్టుకున్న సరే బలవంతంగా ఎవరో లాగినట్లు మాయ‌మైపోతుంటాయి. ఈ పరిణామం చూసి అంత షాక్ అవుతుంటారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఓ పెద్ద పక్షి (అక్షయ్ కుమార్) నగరంలోకి చొరబడి అన్ని నాశనం చేస్తుంటుంది. ఎలాగైనా ఆ పక్షిని అడ్డుకోవాలని శాస్త్రవేత్తలు చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దించడానికి నిర్ణయం తీసుకుంటారు..మరి చిట్టి ఆ పక్షి రాజునూ ఎలా అడ్డుకుంటాడు..? అసలు పక్షిరాజుకు సెల్ ఫోన్స్ ఫై ఎందుకు కోపం వచ్చింది..? అసలు పక్షి రాజు ఎవరు..? తదితర విషయాలు తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* చిట్టి – ప‌క్షిరాజు మధ్య వచ్చే సన్నివేశాలు
* విజువ‌ల్ ఎఫెక్ట్స్‌
* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌
* నిర్మాణ విలువలు

మైనస్ :

* సెంటిమెంట్ సన్నివేశాలు తక్కువ
* మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సినిమాలో ప్రదానంగా రజనీకాంత్ – అక్షయ్ కుమార్ ల నటన గురించి చెప్పుకోవాలి. ఈ వయసులో కూడా రజనీ ఈ రేంజ్ లో నటించడం, డాన్సులు, ఫైట్స్ చేయడం ఆయనకే దక్కుతుంది. ఇందులో సైంటిస్ట్‌ పాత్రలో వసీకరణ్‌గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా చేసి అభిమానులను అలరించాడు.

* విలన్ పాత్రలో పక్షిరాజుగా నటించిన అక్షయ్ నటన అద్భుతం. సినిమా మొత్తం ఎక్కువగా పక్షి గెటప్ లోనే కనిపించాడు. ఈ పాత్రకు ఈయన కరెక్ట్ గా సరిపోయాడు. అయన గెటప్ అందరిని ఆకట్టుకుంది.అక్షయ్‌ నటనలోని మరోకోణాన్ని శంకర్‌ అద్భుతంగా చూపించాడు.

* హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్ పెద్దగా ఉపయోగపడలేదు..తన పరిధి మేర ఉన్నంతలో బాగానే నటించింది.

* ఇక మిగతా నటి నటులంతా తమిళ్ వారే కావడం అదికాక వారి పాత్రలు సైతం పెద్దగా ఏమి లేవు.

సాంకేతిక విభాగం :

* సినిమాకు ప్రధాన ఆకర్షణ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులే. వీరి పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని కొత్త అనుభూతిలోకి తీసుకెళ్లారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

* నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది.

* నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

* ఆంటోని ఎడిటింగ్‌ పనితనం బాగుంది.

* ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

* ఇక శంకర్ విషయానికి వస్తే..తన ప్రతి సినిమాను సామాజిక నేపధ్య కథ ఉండేలా చూసుకుంటాడు. ఇక చిత్ర కథ కూడా సెల్ ఫోన్స్ వల్ల ఎలాంటి హాని జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేసాడు. ఆయన ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నాడో తెరపై అంతే విధంగా చూపించాడు.

ఫస్ట్ హాఫ్ మొత్తం సెల్ ఫోన్ల మాయం అవడం అవి ఎందుకు మాయం అవుతున్నాయో..ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటితోనే సాగుతుంది. పక్షిరాజును అంతం అందించేందుకు చిట్టి ఇవ్వడంతో ఓ ర‌స‌వత్త‌ర‌మైన పోరు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది.

సెకండ్ హాఫ్ మొత్తం చిట్టి – ప‌క్షిరాజుల మధ్య జరిగే పోరాటాలతో సాగుతుంది. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పాడు.ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అందరిని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు.

ఓవరాల్ గా తాను చెప్పాల్సిన మెసేజ్ ను అందరికి అర్ధమయ్యే రీతిలో తెరపై చూపించి సక్సెస్ అయ్యాడు. తాను ఖర్చు పెట్టించిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. కాకపోతే మ్యూజిక్ విషయంలో శ్రద్ద తీసుకుంటే బాగుండు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలపై కూడా దృష్టి పెట్టాల్సింది.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ :3.5/5

Click here for English Review