రివ్యూ : ఆట‌గాళ్లు – ప్రేక్షకులతో ఆడుకున్నారు..

స్టార్ కాస్ట్ : నారా రోహిత్ , జగపతి బాబు ,ద‌ర్శ‌న బానిక్‌ తదితరులు..
దర్శకత్వం : పరుచూరి మురళి
నిర్మాతలు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్
మ్యూజిక్ : సాయి కార్తీక్
విడుదల తేది : ఆగస్టు 24, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : ఆట‌గాళ్లు – ప్రేక్షకులతో ఆడుకున్నారు..

హిట్ , ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నారా రోహిత్..తాజాగా ఆట‌గాళ్లు అంటూ ఓ విభిన్న కథతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో
మరో హీరోగా జగపతి బాబు నటించడం, పరుచూరి మురళి డైరెక్ట్ చేయడం తో ఈ మూవీ ఫై అందరిలో ఆసక్తి పెరిగింది. మరి ఈ మూవీ తో నారా రోహిత్ హిట్ కొట్టాడా..? అసలు ఆట‌గాళ్లు అనే టైటిల్ కు డైరెక్టర్ న్యాయం చేశాడా..లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

సినీ డైరెక్టర్ సిద్ధార్థ్ (నారా రోహిత్‌) ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్ చేయాలనీ కలలుకంటుంటాడు..ఈ నేపథ్యంలో అంజలి (దర్శన్ బానిక్) తో పరిచయం ఏర్పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు..ఇద్దరు హ్యాపీ గా కాపురం చేసుకుంటున్న సమయం లో సడెన్ గా అంజలిని హత్య చేస్తారు. దీంతో ఈ హత్య చేసింది సిద్ధార్థే అని పోలీసులు అరెస్ట్ చేస్తారు.

ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వీరేంద‌ర్‌(జ‌గ‌ప‌తిబాబు) ముందుగా కేసును సిద్ధార్థ్‌కి ప్ర‌తికూలంగా వాదించి అత‌న్ని దోషిగా చూస్తాడు. అయితే.. న్యాయం త‌న ప‌క్క‌న ఉంద‌ని సిద్ధార్థ్ చెప్పిన విష‌యాలు విన్న వీరేంద‌ర్ కొన్ని ఆధారాల‌ను సేక‌రించి.. త‌న‌కు అనుకూలంగే కేసు వాదించి నిర్ధోషిగా నిరూపిస్తాడు. అంజలిని చంపిన కేసు లో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. ఇంతకీ మున్నా ఎవరు…? మున్నా కు ఈ హత్య కు సంబంధం ఏంటి..? నిజంగా అంజలిని చంపింది మున్నానేనా..? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? వీటి అన్నింటికీ సమాదానాలు కావాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* జగపతి బాబు – నారా రోహిత్ యాక్టింగ్

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

* కాన్సెప్ట్

మైనస్ :

* బ్ర‌హ్మానందం

* హీరోయిన్ సెట్ కాలేదు

* డైరెక్షన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

*రొటీన్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యభరిత పాత్రలను ఎన్నుకుంటూ డిఫరెంట్ వేలో వెళుతూ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నారావారబ్బాయి నారా రోహిత్..ఈ చిత్రంలో సినిమా డెరెక్టర్‌గా చక్కటి నటన కనబరిచారు. ఓక్రిమ‌న‌ల్ లాయ‌ర్‌ వీరేంద్ర పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. పాత్రల ప‌రంగా ఇద్ద‌రు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అలాగే న‌ట‌న ప‌రంగా ఇద్ద‌రు ఇచ్చిన అవుట్‌పుట్ బావుంది.

* సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం పాత్ర అన‌వస‌రం ఉంది..సినిమాకు ఈ పాత్ర మైనస్ అయ్యింది.

* ద‌ర్శ‌న బానిక్ నారా రోహిత్ ప‌క్క‌న అస్సలు సెట్ అవ్వలేదు.

* మున్నా తల్లి పాత్రలో తులసి బాగా నటించింది. డీసీపీ నాయక్ పాత్రకు సుబ్బరాజు న్యాయం చేశాడు.

* జీవా, నాగినీడు త‌దిత‌రులు అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* సాయి కార్తీక్ మ్యూజిక్ పెద్దగా ఏమి లేదు..నేపధ్య సంగీతం జస్ట్ ఓకే అనిపించింది.

* విజ‌య్ సి.కుమార్ సినిమాటోగ్ర‌ఫీ పర్వాలేదు అనిపించింది.

* ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండనిపిస్తుంది.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

* ద‌ర్శ‌కుడు ప‌రుచూరి ముర‌ళి క‌థాంశంగా తీసుకున్న పాయింట్ బావుంది. కానీ దానిని తెరపై చూపించడం లో విఫలం అయ్యాడు. చాల సన్నివేశాలు ఆకట్టుకునే తీరుగా చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ సేపు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలకు సమయం కేటాయించి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులకు నవ్వు కాదు ఏడుపు తెప్పించింది. ఒక‌ట్రెండు స‌న్నివేశాలు మిన‌హా ఎమోష‌న‌ల్‌గా సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడు.

చివరిగా :

ఎప్పుడు విభిన్న కథలను ఎంచుకునే నారా రోహిత్..ఈ ఆటగాళ్లు కూడా అదే విధంగా ఎంచుకున్నాడు. కానీ డైరెక్టర్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ , ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించలేకపోయాడు. నారా రోహిత్ , జగపతి బాబు వంటి మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిని సరిగా వాడుకోవడం లో మురళి ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా ప్రేక్షకులను ఆడుకున్నారు.

Click here for English Review