రివ్యూ : ఆవిరి – ‘ఆవిరైపోయింది’

స్టార్ కాస్ట్ : రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త‌ తదితరులు..
దర్శకత్వం : రవిబాబు
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : వైద్య
విడుదల తేది : నవంబర్ 01, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : ఆవిరి – ‘ఆవిరైపోయింది’

రవిబాబు అంటేనే ఏదో ఓ విభిన్న చిత్రం అని అంత ఫిక్స్ అవుతారు సినీ జనాలు..ఆయననుండి సినిమా వస్తుందంటే కొత్తదనం ఉంటుందని భావిస్తారు. ఫస్ట్ డే చూడాలసిందే అనే అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. ఆ మధ్య పందిపిల్ల తో అదిగో అంటూ వచ్చాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఆవిరి అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ ఆవిరి కథ ఏంటి..? ఈ కథ లో రవిబాబు మార్క్ ఎలా ఉంది..? ఆవిరి తో రవిబాబు సక్సెస్ అయ్యాడా లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) లకు ఇద్దరు పిల్లలు..అయితే పెద్ద కుమార్తె చనిపోతుంది. దీంతో ఆ బాధ నుండి బయటపడేందుకు వారు కొత్త ఇంటికి వెళ్తారు. ఆలా వెళ్లిన రోజు నుండే తన చిన్న కూతురు మున్ని (శ్రీ ముక్తా) విచిత్రంగా ప్రవర్తిస్తూ..తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్ధం కాదు..ఈ లోపు సడెన్ గా ఓ రోజు మున్ని కనిపించకుండా పోతుంది. మరి మున్ని ఏమైంది..? ఆలా ఎందుకు ప్రవర్తిస్తుంది..? అనేది అసలు కథ.

ప్లస్ :

* నటి నటుల యాక్టింగ్

* నేపధ్య సంగీతం

* చిత్ర నిడివి

మైనస్ :

* కథ

* ఫస్ట్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* తెరపై కనిపించేవి కొన్ని పాత్రలు అయినప్పటికీ వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

* ముఖ్యంగా మూడు పాత్రలు సినిమాకి ప్రాణం పోసాయి. రాజ్, లీనా, మున్నీల పాత్రలు బాగున్నాయి.

* రవిబాబు ఎప్పటిలాగే రాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. తనకు అలవాటైనా ఎక్స్‌ప్రెషన్స్‌తో రవిబాబు చాలా ఈజీగా నటించేశాడు. ఒకటి రెండు చోట్ల కామెడీ కూడా పండించాడు. అయితే సినిమా మొత్తం సీరియస్ లుక్‌లోనే కనబడ్డాడు.

* ఇక నేహా చౌహాన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించినా.. దెయ్యం పట్టిన పాత్రలో మాత్రం ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో విసుగుపుట్టించింది.

* ఇక సినిమా మొత్తం కనిపించిన శ్రీ ముక్తా పర్వాలేదనిపించింది.

సాంకేతిక విభాగం :

* ఇలాంటి హారర్, థ్రిల్లర్ సినిమాలంటే సంగీతం, నేపథ్యసంగీతం ప్రధానంగా అవసరం. వైద్య అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను సందర్భానుసారంగా భయపెట్టింది.

* సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చక్కగా కుదిరింది.

* ఎడిటింగ్ కూడా సినిమాకు బాగా కుదిరింది. ఎక్కడా సాగదీస్తున్నట్లు అనిపించికుండా కట్ చేశాడు.

* నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్లు ఉన్నాయ్.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..ఆవిరి అనేది ఏముంటుందో అనుకున్నారు కానీ కథలో కొత్తదనం లేదు. ఆత్మలను ఆవిరితో పోల్చడం.. దెయ్యాలకు వేడీ అంటే భయమని చెప్పడం వంటివి చెప్పే ప్రయత్నం చేసాడు కానీ తెరపై చూపించడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు. రవిబాబు నుండి కొత్తదనం చూడాలనుకునేవారికి మరోసారి నిరాశ తప్పదు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review