రివ్యూ : బోరింగ్.. అభినేత్రి

స్టార్ కాస్ట్ : ప్రభుదేవా, తమన్నా, నందితా తదితరులు..
దర్శకత్వం : విజయ్‌
నిర్మాతలు: అభిషేక్
మ్యూజిక్ : సామ్‌ సి.ఎస్‌
విడుదల తేది : మే 31, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ప్రధానతారణంగా విజయ్‌ దర్శకత్వంలో 2016లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన చిత్రం ‘అభినేత్రి’. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ చిత్రం రూపొందింది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

‘అభినేత్రి 2’లో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితాశ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ కీలక పాత్రల్లో నటించారు. మరి అభినేత్రి గా అందర్నీ ఆకట్టుకున్న తమన్నా..మరి అభినేత్రి 2 లో ఎలా ఆకట్టుకుంది ..? అసలు ఈ కథ ఏంటి..? దర్శకుడు విజయ్ ఎలా తెరకెక్కించారనేది..ఇప్పుడు చూద్దాం.\\

కథ :

పెళ్లి చేసుకొని హ్యాపీ గా లైఫ్ కొనసాగిస్తుంటారు కృష్ణ , దేవి ( ప్రభుదేవా , తమన్నా ). ఓ రోజు కృష్ణ ను రెండు దెయ్యాలు పడతాయి. వాటి కోరిక తీర్చుకోవడం కోసం కృష్ణ ను వాడుకుంటాయి. దెయ్యాలు తనను ఆవహించాయనే సంగతి తెలియని కృష్ణ..పూర్తిగా వాటి మాయలో పడతాడు. అప్పటి వరకు దేవి తో ఎంతో హ్యాపీ గా ఉన్న కృష్ణ..సడెన్ గా పట్టించుకోకపోవడం తో అసలు ఏం జరిగిందా అని దేవి ఆరా తీస్తుంది. తన భర్త ను రెండు దెయ్యాలు ఆవహించాయని తెలుసుకున్న దేవి ..తన భర్త ను ఎలా కాపాడుకుంటుంది..? ఆ రెండు దెయ్యాలు కృష్ణననే ఎందుకు ఆవహిస్తాయి..? అసలు ఆ రెండు దెయ్యాల కథ ఏంటి..? అనేది సినిమా కథ.

ప్లస్ :

* తమన్నా – ప్రభుదేవా ల యాక్టింగ్

* క్లైమాక్స్

మైనస్ :

* స్లో నేరేషన్

* విసుగుతెప్పించే సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* తమన్నా – ప్రభుదేవా ఇద్దరు కూడా సినిమాకు హైలైట్ అయ్యారు. తమన్నా గ్లామర్ తోనే కాక యాక్టింగ్ తో కూడా కేక పుట్టించింది. దెయ్యాల నుండి తన భర్త ను కాపాడుకునే భార్య గా ఆ పాత్ర లో ప్రాణం పెట్టింది. ఇక ప్రభుదేవా సైతం తన డాన్స్ , నటన తో ఆకట్టుకున్నాడు.

* నందితా శ్వేత గ్లామర్ తో మరోసారి కట్టిపడేసింది.

* డింపుల్‌ హయాతి, కోవైసరళ తదితరులు వారి వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక విభాగం :

* సామ్‌ సి.ఎస్‌ మ్యూజిక్ పర్వాలేదు..

* అయాంకా బోస్‌ సినిమా ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది..

* సత్య డైలాగ్స్ జస్ట్ ఓకే

* నిర్మాణ విలువలు బాగున్నాయి..

* ఇక డైరెక్టర్ విజయ్ విషయానికి వస్తే సినిమాను బాగా స్లో గా సాగదీసి విసుగు తెప్పించాడు. అనవసర కామెడీ రాసుకొని..సినిమాపై ఉన్న ఆసక్తిని తగ్గించాడు. లాజిక్ లేని సన్నివేశాలు రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని హర్రర్ సన్నివేశాలు కాస్త భయపెట్టాయి.

తమన్నా గ్లామర్ ను బాగా వాడుకున్నాడు..తమన్నా లోని నటనను మరోసారి బయటకు తీసాడు. ఇంకాస్త కథ ఫై శ్రద్ద పెట్టి..స్లో నేరేషన్ లేకుండా చూసుకుంటే ఫలితం మరోలా ఉండేది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review