రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోనీ – విసుగుతెచ్చే రివెంజ్ డ్రామా

స్టార్ కాస్ట్ : రవితేజ , ఇలియానా , సునీల్ తదితరులు..
దర్శకత్వం : శ్రీను వైట్ల
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : నవంబర్ 16, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోనీ – విసుగుతెచ్చే రివెంజ్ డ్రామా

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. వరుస హిట్ల తో దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించగా , భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. వరస పరాజయాలతో వెనకబడిపోయిన శ్రీను వైట్లకు ఇది తాడోపేడో సినిమా. అందుకే ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి మళ్లీ ట్రాక్ లోకి రావాలని ఎంతో కసితో ఈ సినిమాను తెరకెక్కించారు.

విడుదలైన ట్రైలర్స్ , టీజర్స్ కొత్తగా ఉండడం తో శ్రీను వైట్ల కు మళ్లీ విజయం దక్కినట్లే అని అంత అనుకుంటున్నారు. మరి వారు అనుకున్నట్లు సినిమాను తెరకెక్కించారు..రవితేజ – శ్రీను కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసిందా..? రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు ఈ సినిమా కలిసొచ్చిందా అనేది చూద్దాం.

కథ :

ప్రాణ స్నేహితులైన ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాలు అమెరికాలో వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తారు. వీరిద్దరికి అమర్, ఐశ్వర్య (రవితేజ, ఇలియానా) ఇద్దరు పిల్లలు పుడతారు. వీరిద్దరికి పెద్దయ్యాక పెళ్లి చేయాలని చిన్నతనంలో ఫిక్స్ అయిపోతారు ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాలు. వ్యాపారంలో లాభాలు రావడంతో ఈ ఇద్దరు స్నేహితులు తమ కంపెనీలో పనిచేసే నలుగురు మిత్రులకు పార్టనర్ షిప్ ఇస్తారు. కానీ వారు మాత్రం పార్టనర్ షిప్ తో పాటు.. ఆస్థి మొత్తంపై కన్నేస్తారు. ఆలా ఆ నలుగురు ఇద్దరు మిత్రుల్ని కుటుంబంతో సహా చంపేస్తారు. కానీ అమర్, ఐశ్వర్య లు మాత్రం తప్పించుకుంటారు.

ఆలా ఇద్దరు వేరు వేరుగా పెరిగి పెద్దవుతారు. ఎలాగైనా తమ కుటుంబాన్ని చంపిన వారిని ఎలాగైనా చంపాలని అనుకుంటారు..మరి చంపిన వారిని ఈ ఇద్దరు చంపుతారా..? లేదా..? అసలు వీరిద్దరూ ఎప్పుడు..ఎలా.. కలుస్తారు..? అసలు అక్బర్ , ఆంటోనీ ఎవరు…? వీరికి అమర్ కు సంబంధం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు

* నిర్మాణ విలువలు

* రవితేజ యాక్టింగ్

మైనస్ :

* కథ – కథనం

* క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రవితేజ ఎప్పటిలాగానే తన ఎనర్జ్ తో ఆకట్టుకున్నాడు. అక్బర్, అమర్, ఆంటొని అనే మూడు పాత్రల్లో బాగానే నటించారు. కథ సైడ్ ట్రాక్‌కి వెళ్లిపోవడంతో రవితేజ నటన సినిమాను కాపాడలేకపోయింది. గత చిత్రాలతో పోల్చుకుంటే స్టైలిష్ లుక్‌లో ఎనర్జిటిక్‌గా నటించారు. ముఖ్యంగా అక్బ‌ర్ పాత్ర‌లో ఆయ‌న చేసే సంద‌డి వినోదాన్ని పండించింది.

* ఇలియానా దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కథలో ఆమె పాత్ర పెద్దగా ఏమి లేదు. కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. గ్లామర్ పరంగా కూడా పెద్దగా మార్కులు వేసుకోలేకపోయింది.

* ‘ఓటా’ అంటూ ఫస్టాఫ్‌లో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సత్య, గిరిధర్, జయప్రకాష్ రెడ్డిలు మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా జూనియర్ పాల్‌గా సత్య చేసిన కామెడీ పొట్ట చెక్కలు చేస్తుంది.

* సెకండాఫ్‌లో సునీల్ ఎంట్రీ ఇచ్చిన.. సత్య వాళ్లందర్నీ డామినేట్ చేసేశాడు.

* అలనాటి సీనియర్ హీరోయిన్ లయ.. ఈ చిత్రంలో హీరోకి తల్లిగా నటించినప్పటికీ ఆమెకు సింగిల్ డైలాగ్ కూడా లేదు. స్క్రీన్‌పై ఆమెను వెతుక్కోవల్సిన పరిస్థితి.

* ఇక మిగతా పాత్రల్లో నటించిన వారంతా వారి వారి పరిధి మేరకు బాగానే చేసారు.

సాంకేతిక విభాగం :

* తమన్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. విజువల్‌గా సాంగ్స్ బాగా వచ్చాయి.

* వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలోని అందమైన లొకేషన్లును బాగా చూపించారు.
ఇలియనాను అందంగా చూపించారు.

* మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక శ్రీను వైట్ల విషయానికి వస్తే..ఆగడు, మిస్టర్ వంటి డిజాస్టర్‌లతో ఇక శ్రీను పని అయిపోయిందని అంత ఫిక్స్ అయ్యారు. కానీ రవితేజ ట్రబుల్ షూటర్‌గా శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ముందుకు వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ఇదే అనుకుంటే సక్సెఫుల్ హిట్ చిత్రాల బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబోని డీల్ చేయడానికి ముందుకు రావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పాడ్డాయి.

టైటిల్‌తో పాటు టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకోవడంతో శ్రీనువైట్ల బౌన్స్ బ్యాక్ అవుతారనే నమ్మకం అందరిలో పెరిగింది. కానీ శ్రీను వైట్ల ఏమాత్రం మారలేదని మరోసారి అందరికి క్లియర్ గా అర్ధం అయ్యింది.

‘అమర్ అక్బర్ ఆంటోని’ ఓ రివేంజ్ స్టోరీ కాని దానికి ‘డిసోసియేటివ్ ఐడెంటిటీ’ వ్యాధిని హీరోకి ఎక్కించి మూడు పాత్రల్లో చూపించి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ముగ్గురూ ఒక్కరే.. ఒక్కర్లోనే ముగ్గురూ ఉంటారు.. ఎప్పుడు ఏ క్యారక్టర్ బయటకు వస్తుందో తెలియదు. కథ సీరియస్‌గా నడుస్తున్న సందర్భంలో ఈ క్యారెక్టర్‌లు కన్ఫ్యూజ్ చేస్తాయి. దీంతో అసలు ఎవరు అమర్ ? ఎవరు అక్బర్ ? ఎవరు ఆంటొని ? అనేది తెలియక ప్రేక్షకులు ఒకరికి ముఖం ఒకరు చూసుకున్నారు. కథ -కథనం ఆకట్టుకోలేకపోవడం చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ ను కలుగ చేసింది.

చివరిగా :

ఫస్ట్ హాఫ్ అంత అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటొనిలుగా ర‌వితేజ చేసే అల్ల‌రి, కమెడియన్స్ సాగిన సన్నివేశాలతో సాగుతుంది. సినిమా అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలు అవుతుంది. కాకపోతే సినిమా మొదట్లోనే ఇదో రివేంజ్ స్టోరీ అని అర్ధం కావడం తో చివరి వరకు పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది.

ఇక ఈ సినిమా తో శ్రీను వైట్ల హిట్ కొడతాడని అంత అనుకున్నారు కానీ మరోసారి దెబ్బ తిన్నాడు. ఇక రవితేజ సైతం మరో ప్లాప్ చూడాల్సి వచ్చినట్లే అనిపిస్తుంది. సవ్య సాచి తో ప్లాప్ చూసిన మైత్రి మూవీస్ కు ఈ అమర్ దెబ్బ కూడా గట్టిగానే తగిలేటట్లుంది. ఓవరాల్ గా శ్రీను వైట్ల విసుగుతెచ్చే రివెంజ్ డ్రామా ను అందించాడు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review