రివ్యూ : అర్జున్ సురవరం – లేటైనా మెప్పించాడు

స్టార్ కాస్ట్ : నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ తదితరులు..
దర్శకత్వం : టీఎన్‌ సంతోష్‌
నిర్మాతలు: ‘ఠాగూర్‌’ మధు, రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
మ్యూజిక్ : సామ్‌ సీ.ఎస్‌
విడుదల తేది : నవంబర్ 29, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : అర్జున్ సురవరం – లేటైనా మెప్పించాడు

యంగ్ హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం చిత్రం ఎట్టకేలకు ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. సంతోష్ డైరెక్షన్లో ఠాగూర్ మధు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా..పోసాని కృష్ణ మురళి , నాగినీడు, వెన్నల కిషోర్ లు నటించారు. తమిళ్ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ వాస్తవానికి గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా..ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తడం తో విడుదలకు నోచుకోలేదు. మరి ఎంత కాలం ల్యాబ్ కే పరిమితమైన ఈ మూవీ ఎలా ఉంది..? ఈ సినిమాతో నిఖిల్ హిట్ అందుకున్నాడా..లేదా..? అస్లు ఈ సినిమా కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్‌ లెనిన్‌ సురవరం (నిఖిల్‌)..ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత జాబ్ చేయాలనీ తండ్రి (నాగినీడు) కలలు కంటాడు. కానీ సురవరం మాత్రం జర్నలిజంపై ఇష్టం తో ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేసి ఓ టీవీ ఛానల్ లో రిపోర్టర్ గా చేరతాడు. ఎలాగైనా బీబీసీలో పనిచేయాలని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో కావ్య (లావణ్య త్రిపాఠి) సాయం తో బీబీసీలో చేరతాడు. ఈ లోపే ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ పెట్టి అర్జున్‌ బ్యాంకు లను మోసం చేశాడంటూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? నిజంగా సురవరం మోసం చేశాడా..? అసలు ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ కు సురవరానికి సంబంధం ఏంటి..? ఈ కేసు నుండి అర్జున్ ఎలా బయటపడతాడు..? అనేది మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* కథ – కథనం

* కామెడీ

* నిఖిల్ యాక్టింగ్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* నేపధ్య సంగీతం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* నిఖిల్‌ మరోసారి తన యాక్టింగ్ తో మెప్పించాడు. ఈ సినిమా కోసం నిఖిల్ ఎంత కష్టపడ్డాడు అనేది సినిమా చూస్తే ఖచ్చితంగా అర్ధమవుతుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు సినిమాను తన భుజాలపై మోశాడు.

* హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పాత్ర పెద్దగా ఏమిలేదు. హీరో వెంట క్లైమాక్స్‌ వరకు ఉన్నప్పటికీ ప్రాధాన్యం లేని పాత్ర ఆమెది. ఫస్టాప్‌లో లవ్‌ట్రాక్‌ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది.

* హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి తన కామెడీ తో థియేటర్స్ లలో నవ్వులు పోయించాడు.

* విలన్‌ పాత్రలో తరుణ్‌ అరోరా ఆకట్టుకోగా, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* సూర్య సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* సామ్‌ సీ.ఎస్‌ పాటలు గాని నేపధ్య సంగీతం గాని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..రీమేక్ కథ అయినప్పటికీ ఆ ఛాయలు కనిపించకుండా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్స్‌ నేపధ్య కథ తో ..దానికి తగ్గట్లు కథనం రాసుకొని సక్సెస్ అయ్యాడు. అనేక ట్విస్ట్ లతో సినిమా అంత కూడా ఆసక్తిగా సాగుతుంది. అలాగే అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీసాడు.

కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను నిలబెట్టేలా బావున్నాయి. ఎమోషనల్‌ సీన్లను దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కానిస్టేబుల్‌ సుబ్బారావు (పోసాని కృష్ణమురళీ) చనిపోయిన సీన్‌లో అతని కొడుకు (వెన్నెల కిషోర్‌) భావోద్వేగాలు.. ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా పండాయి. డైలాగులు బావున్నాయి. ఓవరాల్ గా లేటైనా అర్జున్ మెప్పించాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review