రివ్యూ : భీష్మ – ఫుల్ టూ ఫన్ ఎంటర్‌టైనర్‌

స్టార్ కాస్ట్ : నితిన్ , రష్మిక తదితరులు..
దర్శకత్వం : వెంకీ కుడుముల
నిర్మాతలు: సితార ఎంటెర్టైమెంట్స్
మ్యూజిక్ : మహతి స్వర సాగర్‌
విడుదల తేది : ఫిబ్రవరి 21, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : భీష్మ – ఫుల్ టూ ఫన్ ఎంటర్‌టైనర్‌

నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ శివరాత్రి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? అసలు భీష్మ కథ ఏంటి..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

ఐయామ్‌ సింగిల్‌ అంటూ ప్రతి అమ్మాయి వెంటపడే భీష్మ (నితిన్ )..ఓ రోజు చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. డిగ్రీ ఫెయిల్ అయినా భీష్మ కు ..ఎనిమిది వేల కోట్ల విలువ చేసే ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీకి భీష్మ సీఈఓ గా ఆఫర్ వస్తుంది. ఆ ఆఫర్ ఎలా వస్తుంది..? భీష్మ (నితిన్ ) కు ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ అధినేత భీష్మ (అనంత్‌ నాగ్‌) కు సంబంధం ఏంటి..? భీష్మ ఆర్గానిక్‌ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్‌ సైన్స్‌ కంపెనీ ఎందుకు ట్రై చేస్తుంటుంది..వారి ప్రయత్నాలు ఏమవుతాయి..? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* కామెడీ

* నితిన్ – రష్మిక ల యాక్టింగ్

* కథలో వచ్చే ట్విస్ట్ లు

మైనస్ :

* కథ

* ఎమోషనల్ సీన్లు

* విలనిజం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఈ మూవీ లో నితిన్ తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి అభిమానులకు , ప్రేక్షకులకు కొత్తగా అనిపించాడు. ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్‌లర్‌గా కనిపించిన నితిన్‌, సెకండాఫ్‌లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించి ఆకట్టుకున్నాడు. రష్మిక – నితిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

* రష్మిక మరోసారి తన యాక్టింగ్ తో కట్టిపడేసింది. గ్లామర్ పరంగానే కాక డాన్సుల తో కూడా చించేసింది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉన్నాయి.

* అనంత్‌ నాగ్‌ ..నితిన్ తాత పాత్రలో బాగా చేసారు. వెన్నెల కిశోర్‌, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్‌ అదిరిపోయింది.

* విలన్‌గా కనిపించిన జిషుసేన్‌ గుప్త క్లాస్‌ విలన్‌గా పర్వాలేదు అనిపించాడు. ఈయన్ను డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోయాడు. లేకపోతే జిషుసేన్‌ కు ఇంకాస్త మార్కులు పడేవి.

* ప్రత్యేక పాత్రలో కనిపించిన హెబ్బా పటేల్‌ తన పాత్ర మేరకు బాగానే చేసింది.

* ఇక మిగతా పాత్రల్లో నటించిన నటి నటులు వారి పరిధి మేరకు బాగా చేసారు.

సాంకేతిక విభాగం :

* మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వర సాగర్‌ మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. కేవలం పాటలు మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో చక్కగా ఇచ్చి సినిమా విజయంలో భాగం అయ్యారు.

* సాయి శ్రీరామ్‌ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు.

* ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ..తన మొదటి సినిమాలో ఎలాగైతే కామెడీ ని వర్క్ అవుట్ చేసాడో..ఈ మూవీ లోను అదే కామెడీ ని నమ్ముకున్నాడు. కథ పెద్దగా లేకపోయినప్పటికీ ఉన్న కథలోనే కామెడీ జోడించి ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను నడిపించాడు. కథ మొత్తం భీష్మ (నితిన్‌, అనంత్‌ నాగ్‌, ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్‌ చేశాడు. కామెడీ , హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు , సంగీతం , మాటలు , స్క్రీన్ ప్లే ఇలా అన్ని కూడా కథకు సరిగ్గా సరిపోయేలా చూసుకొని విజయం సాధించాడు.

ఓవరాల్ గా .. శివరాత్రి కానుకగా వచ్చిన భీష్మ..ప్రేక్షకులను ఫుల్ గా ఎంజాయ్ చేసింది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

Click here for English Review