రివ్యూ : బుర్ర ‘కథ’ లేదు

స్టార్ కాస్ట్ : ఆది , మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా , రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు..
దర్శకత్వం : డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాతలు: దీపాల ఆర్ట్స్‌
మ్యూజిక్ : సాయి కార్తీక్
విడుదల తేది : జులై 05 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : బుర్ర ‘కథ’ లేదు

గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఆది సాయికుమార్.. తాజాగా బుర్రకథ అనే సినిమాతో ఈరోజు (జులై 05) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైమండ్ రత్నబాబు డైరెక్టర్ గా పరిచయం చేస్తూ బుర్రకథ అనే సినిమా తెరకెక్కింది. దీపాల ఆర్ట్స్ బ్యానర్ ఫై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల, కిషోర్, ఎంవీ కిరణ్ రెడ్డి నిర్మించగా..మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ సినిమా కథ ఏంటి..? ఆది కి ఈ సినిమా ఏ మేరకు కలిసొచ్చింది..? డైమండ్ రత్నబాబు డైరెక్టర్ గా సక్సెస్ సాదించాడా..లేదా అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

అభి రామ్ (ఆది) పుట్టడం పుట్టడమే రెండు మెదడ్లతో పుడతాడు..దీంతో అతడు రెండు రకాలుగా ఆలోచిస్తూ పెరుగుతాడు. ఆలా పెరిగిన అభి..తనలో మరో వ్యక్తి ఉన్నాడని ..అతడి ఆలోచన ..తన ఆలోచన వేరు అని తెలుసుకుంటాడు. ఇద్దరి ఆలోచనలు వేరు..ఇద్దరి ప్రవర్తన వేరు..దీంతో వారు ఏది అనుకున్న..ఒకరిది మరొకరికి నచ్చదు. ఆలా ఇది సాధించలేక మిగిలిపోతారు. ఈ సమయంలో వారికీ ‘హ్యాపీ’ (మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి) పరిచయం అవుతుంది. ఆమె పరిచయం తర్వాత వారిలో వచ్చిన మార్పులు ఏంటి..? ఆ మార్పుల కారణంగా వారి లక్ష్యాన్ని సాదించుకుంటారా..? ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు..? వంటివి మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* స్టోరీ లైన్

* ఆది యాక్టింగ్

మైనస్ :

* కథ – కథనం

* సాగదీత సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఆది సాయి కుమార్ లోని అసలైన నటన ను బయటకు తీసాడు. అభి , రామ్ గా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు.

* మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి గ్లామర్ పరంగానే కాక నటన పరంగా కూడా మార్కులు వేసుకుంది.

* నైరా షా ను కేవలం గ్లామర్ పరంగానే వాడుకున్నారు.

* ఆది తండ్రి రోల్ లో నటించిన రాజేంద్ర ప్రసాద్ మరోసారి ఆకట్టుకున్నారు. ఈయన డైలాగ్స్ బాగా పేలాయి.

* పోసాని కృష్ణ‌ముర‌ళి , చంద్ర, పృథ్వి, గాయ‌త్రి గుప్తా, అభిమ‌న్యుసింగ్, ఫిష్ వెంక‌ట్‌, ప్ర‌భాస్ శ్రీను
గీతా సింగ్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించే ప్రయత్నం చేసారు.

సాంకేతిక విభాగం :

* సాయికార్తీక్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగానే ఉంది.

* ఎం ఆర్ వర్మ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సిందే. అనవసర సన్నివేశాలు ఎక్కువగా ఉండి..ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి.

* సి.రాంప్ర‌సాద్‌ సినిమా ఫొటోగ్రఫీ ఓకే

* దీపాల ఆర్ట్స్‌ నిర్మాణ విలువలు కథకు తగ్గట్లే ఉన్నాయి.

ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..ర‌చ‌యిత గా ప్రేక్షకులను ఆకట్టుకున్న డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయన రాసుకున్న లైన్ బాగానే ఉన్నప్పటికీ..తెరపై దానిని తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. సాగదీత సన్నివేశాలు..అర్ధం పర్థం లేని కామెడీ..మసాలా సన్నివేశాల మూలంగా కథ ఎటు వెళ్తుందో అర్ధం కానీ పరిస్థితి. సెకండ్ హాఫ్ అంత కూడా స్లో నేరేషన్ తో సాగింది. ప్రీ క్లైమాక్స్..క్లైమాక్స్ కూడా గొప్పగా లేవు. ఆది గట్టిగానే కష్టపడినప్పటికీ కథ లో దమ్ము లేకపోవడం..స్లో నేరేషన్..కారణంగా అది పడిన కష్టం వృధా అయ్యింది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Click here for English Review