రివ్యూ : రొటీన్ ‘చాణక్య’..

స్టార్ కాస్ట్ : గోపీచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ తదితరులు..
దర్శకత్వం : తిరు
నిర్మాతలు: అనిల్ సుంకర
మ్యూజిక్ : విశాల్ చంద్రశేఖర్
విడుదల తేది : అక్టోబర్ 05, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : రొటీన్ ‘చాణక్య’

గోపిచంద్, మెహ‌్రీన్ జంట‌గా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య‌’. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 05 న ) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , టీజర్స్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదానితో ఆకట్టుకోవడం తో సినిమా ఫై అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..లేదా అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

అర్జున్ (గోపీచంద్)..పాకిస్థాన్ నుండి ఇండియన్ కాపాడేందుకు రా ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటాడు. కానీ అర్జున్ రా ఏజెంట్‌ అని ఎవరికీ తెలియకుండా బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన అబ్దుల్ సలీమ్‌ను రా ఆపరేషన్‌లో భాగంగా అర్జున్ చంపేస్తాడు. దీంతో అర్జున్ ఫ్రెండ్స్ ను
వరుస టెర్రర్ ఎటాక్స్‌ని ప్లాన్ చేసే ఇబ్రహీం ఖురేషీ కిడ్నాప్ చేసి కరాచీకి తీసుకుపోతాడు. అప్పుడు అర్జున్ కరాచీకి వెళ్తాడు. ఆలా వెళ్లిన అర్జున్ తన ఫ్రెండ్స్ ను ఎలా విడిపించాడు..? ఇండియా ను ఎలా కాపాడాడు..? అనేది అసలు స్టోరీ.

ప్లస్ :

* గోపీచంద్

* కెమెరావర్క్ వర్క్

మైనస్ :

* రొటీన్ కథ

* బోరింగ్ సన్నివేశాలు

* మ్యూజిక్

* ఎడిటింగ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రా ఏజెంట్‌గానూ గోపీచంద్ ఆకట్టుకున్నాడు. డైరెక్ట్ ఏం చెపితే అది చేసాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఛేజింగ్ సన్నివేశాల్లో ఎంతో కష్టపడ్డాడు. అయితే కథలో కంటెంట్ లేకపోవడంతో అతని పాత్ర కూడా తేలిపోయింది.

* హీరోయిన్ మెహ్రీన్ విషయానికి వస్తే..సాంగ్ కోసం..హీరో తో రొమాన్స్ కోసం అన్నట్లు ఆమె ఉంది తప్ప కథలో పెద్దగా ఏమిలేదు. ఇమెకన్నా సెకండ్ హీరోయిన్ గా చేసిన బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మెహ్రీన్ కంటే బెటర్‌గానే పెర్ఫామ్ చేసింది .

* రా చీఫ్‌గా నాజర్ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

* రాజేష్ ఖట్టర్, ఉపేన్ పటేల్ మొదలగు వారు వారి పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం :

* విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించారు.

* అబ్బూరి రవి అందించిన సంబాషణలు ఆకట్టుకోలేదు.

* వెట్రి కెమెరావర్క్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. బార్డర్ సీన్స్‌ని బాగా చూపించారు.

* ఎడిటింగ్ పరంగా మార్తాంగ్ కె వెంకటేష్ సినిమాను చాలా వరకూ ట్రిమ్ చేస్తే బాగుండేది.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. టెక్నికల్ పరంగా స్పై థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన గ్రాండ్ లుక్‌ను తీసుకురావడంతో సక్సెస్ అయ్యాడు. హై టెక్నాలజీ సిస్టమ్స్, మానిటరింగ్ రూమ్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. ఛేజింగ్ సీన్లకు భారీగానే ఖర్చు చేశారు. కాకపోతే కథ అనేది కొత్తగా రాసుకోలేకపోయాడు.

సినిమా ప్రారంభమైన తొలి సీన్‌తో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగినప్పటికీ ఇది కొత్త కాదు పాత రోతే అని కాసేపటికే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. నెక్స్ట్ సన్నివేశాలు ఏంటి..చివరికి ఏమవుతుందనేది ఈజీ గా అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా..చేయికకు తెప్పించింది.

ఇక సెకండ్ హాఫ్ సైతం ఆసక్తి కరంగా తెరకెక్కించలేకపోయాడు. రొటీన్‌ సీన్లతో అస్సలు లాజిక్ లేని రివేంజ్ స్టోరీతో అబ్బా ఏంటిది అనిపించాడు. ఓవరాల్ గా గోపి ఖాతాలో మరో ప్లాప్ చేరినట్లే అని ప్రేక్షకులు అంటున్నారు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review