రివ్యూ : దర్బార్ – ఫ్యాన్స్ కు పండగే..

స్టార్ కాస్ట్ : రజనీకాంత్ , నయనతార , సునీల్ శెట్టి తదితరులు..
దర్శకత్వం : మురుగదాస్
నిర్మాతలు: లైకా ప్రొడక్షన్
మ్యూజిక్ : అనిరుద్
విడుదల తేది : జనవరి 09, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : దర్బార్ – ఫ్యాన్స్ కు పండగే..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ – మురుగ‌దాస్ తెరకెక్కిన ద‌ర్భార్ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా తమిళ్ , తెలుగు , హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ర‌జ‌నీకాంత్ పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటించగా.. ఆయనకు జోడిగా నయనతార నటించింది. అలాగే ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించింది. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో తెలుగు లో ఎన్ వి ప్రసాద్ విడుదల చేసారు. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? పోలీస్ ఆఫీసర్ గా రజనీ ఇలా అదరగొట్టాడు..? అసలు దర్బార్ కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆదిత్య అరుణాచలం(రజనీకాంత్) చాల స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఒక‌రోజులోనే 13 మందిని ఎన్‌కౌంట‌ర్ చేసేస్తాడు. దాంతో ముంబైలోని దాదాలంద‌రూ అరుణాచలం పేరు వింటే భ‌య‌ప‌డిపోతుంటారు. ఆ క్రమంలోనే ప్రధాన విలన్ హరి చోప్రా (సునీల్ శెట్టి) గురించి తెలుసుకుంటాడు. 27 ఏళ్ల కింద 30 మంది పోలీసులను సజీవదహనం చేసి తప్పించుకుని విదేశాలకు పారిపోతాడు హరి.

ఆయన్ని పట్టుకోడానికి స్కెచ్ వేస్తాడు ఆదిత్య. అయితే ఇదిలా జరుగుతుండగానే ఆదిత్య కూతురు వల్లి(నివేదా థామస్) చనిపోతుంది. ఆమె ఎలా చనిపోతుంది.. ఎవరు చంపేస్తారు.. అసలు హరి కు ముంబై కి సంబంధం ఏంటి..? హరి ని ఆదిత్య పట్టుకుంటాడా లేదా..? అనేది అసలు కథ.

ప్లస్ :

* రజనీకాంత్

* ఫస్ట్ హాఫ్

* యాక్షన్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* విలన్ ట్రాక్

* కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రజినీకాంత్ మరోసారి అదరగొట్టాడు.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రప్ఫాడించాడు. ముఖ్యంగా వన్ మ్యాన్ షోతో అలరించాడు.

* హీరోయిన్‌గా చేసిన న‌య‌న‌తార‌, కూతురుగా చేసిన నివేదా థామ‌స్ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

* సెకండాఫ్ అంతా మెయిన్ విల‌న్ సునీల్ శెట్టి, హీరో ర‌జినీకాంత్ మ‌ధ్య‌నే ఎక్కువ భాగం సాగుతుంది.

* ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, న‌వాజ్‌షా, యోగిబాబు ఉన్నంత‌లో కామెడీతో న‌వ్వించే ప్రయ‌త్నం చేశాడు.

సాంకేతిక విభాగం :

* అనిరుధ్ పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది

* సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉంది.

* ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా సాగినప్పటికీ ..సెకండ్ హాఫ్ స్లో అయ్యింది. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. దేశంలో చాలా చోట్ల హైలైట్ అవుతున్న డ్రగ్స్‌తో పాటు ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు మురుగదాస్. దానికి రజినీ ఇమేజ్ ను జత చేసి సక్సెస్ అయ్యాడు. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ కథనంలో వేగం తగ్గకుండా చూసుకున్నాడు. స్క్రీన్ ప్లే బాగుండటంతో ఇంటర్వెల్ వరకు అదిరిపోయింది. కాకపోతే సెకండ్ హాఫ్ ఫై ఇంకాస్త శ్రద్ద పెడితే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా రజనీ అభిమానులు ఏం కోరుకున్నారో దానిని తెరకెక్కించి ఫ్యాన్స్ ను ఖుషి చేసారు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review