రివ్యూ : దేవ్

స్టార్ కాస్ట్ : కార్తీ , రకుల్ , ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ తదితరులు..
దర్శకత్వం : రంజిత్
నిర్మాతలు: ఠాగూర్ మధు
మ్యూజిక్ : హరీష్ జైరాజ్
విడుదల తేది : ఫిబ్రవరి 14, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : దేవ్

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దేవ్’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ( ఫిబ్రవరి 14 న ) గ్రాండ్ గా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కి రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహించారు.

‘ఖాకీ’ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కార్తీ కలయిక లో వస్తున్నచిత్రం కావడం , ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటించడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

వరల్డ్ లోనే టాప్ బిజినెస్ మాన్ అయినా రామలింగం (ప్రకాశ్ రాజ్) కొడుకు దేవ్ (కార్తీ). తన తర్వాతి స్థానంలో కొడుకును పెద్ద బిజినెస్ మాన్ చేయాలనీ రామలింగం భావిస్తాడు. కానీ దేవ్ కు మాత్రం బిజినెస్ ఫై కంటే అడ్వంజరస్‌ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. అలాగే బతుకుతాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఫేస్‌బుక్ లో మేఘనా పద్మావతి(రకుల్ ప్రీత్)ని దేవ్ చూస్తాడు.

తొలి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు. కానీ మేఘన కు మాత్రం ప్రేమ అన్న , మగాళ్లు అన్న అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి మగాడు.. మోసగాడు అనే ధోరణిలో ఉంటుంది. అలాంటి ధోరణి కలిగిన అమ్మాయి ని దేవ్ ఎలా లవ్ లో పడేసాడు..? అడ్వంచర్‌ అంటే ఇష్టపడే దేవ్ కు మేఘన ప్రేమ ఎలా సహాయ పడుతుంది..? అసలు మేఘన ఏమిచేస్తుంది ? మరి ఈ అడ్వంచర్‌ లో దేవ్ కు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి..అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* రకుల్ , కార్తీ యాక్టింగ్

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* కథ

* స్లో నేరేషన్

* బోరింగ్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సినిమాలో కార్తీ రోల్ హైలైట్ గా ఉంది. తన నటన, ఫైట్లు, అడ్వంచర్ ఫీట్లతో అభిమానులను , ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ జోనర్ సినిమా అని ప్రచారం చేసినప్పటికీ రొమాన్స్ చేయడానికి కార్తికి పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు డైరెక్టర్. దీంతో కార్తీ లోని రొమాంటిక్ యాంగిల్ ను అభిమానులు మిస్ అయ్యారు.

* రకుల్ విషయానికి వస్తే.. బిజినెస్ ఉమెన్ పాత్రలో రకుల్ ఎప్పటిలానే ఆకట్టుకుంది. తన స్వార్థం కోసం చూసుకునే అమ్మాయిలా మెప్పించింది. అలాగే గ్లామర్ గా కూడా కనిపించి ఫ్యాన్స్ ను అలరించింది.

* ఆర్జే విఘ్నేష్ గా విఘ్నేష్ ప్రేక్షకుల చేత నవ్వు తెప్పించాడు..

* ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అమృత శ్రీనివాసన్ తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా ఈ చిత్రానికి సంగీతం అందించిన హరీష్ జైరాజ్ గురించి చెప్పుకోవాలి..చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి సంగీతం ఇచ్చి ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నన్ను వీడి’ పాట అందర్నీ కట్టిపడేసింది. అలాగే నేపథ్య సంగీతం కూడా బాగుంది.

* వేల్‌రాజా సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అడ్వంచర్ సన్నివేశాల్లో తన కెమెరా పనితనం చూపించాడు.

* ఎడిటర్ ఆంటొని ఎల్. రూబెన్ తన కత్తెరకు కాస్త పనిచెప్పి ఉండాల్సింది. మరీ రెండున్నర గంటలు సినిమాను సాగదీసి విసిగించారు.

* సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..కొత్త డైరెక్టర్ రజత్ ఎంచుకున్న లైన్ బాగున్నప్పటికీ దానిని తెరకెక్కించడం లో విఫలమయ్యాడు. అడ్వంచర్‌లో కూడా ప్రేమ ఉంటుందని.. ఆ ప్రేమకు అడ్వంచర్ ఉపయోగపడుతుందని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు.

కథ పెద్దగా లేకపోయినప్పటికీ అడ్వంచర్, ప్రేమ అంటూ సినిమాను సాగదీసాడు. ఫస్టాఫ్‌లో ఫ్రెండ్స్ తో దేవ్ అడ్వంచర్లు, మేఘనాను కలవడం, ఆమెను ఇంప్రస్ చేయడానికి చేసే ప్రయత్నాలను చూపించాడు. ఇక సెకండ్ హాఫ్ లో దేవ్, మేఘనా మధ్య మనస్పర్థలు, తండ్రితో దేవ్ అనుబంధం, ఎవరెస్ట్ శిఖరాన్ని దేవ్ అధిరోహించడం వంటివి చూపించాడు. కానీ బోరింగ్ సన్నివేశాలతో విసుగు తెప్పించాడు.

చివరగా :

కార్తీ నుండి ఏదో ఎక్స్పెట్ చేసి వెళ్తే నిరాశ కు గురి కావడం ఖాయం. కార్తి చేసిన అడ్వంచర్ ఫీట్లు, ఫైట్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ఆసక్తి లేని కథ – కథనం ప్రేక్షకులను బోర్ ఫీల్ తీసుకొస్తుంది. ఓవరాల్ గా కార్తీ అడ్వంచర్ కోసం చూడచ్చు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Click here for English Review