రివ్యూ : దేవదాస్ – టాలీవుడ్ కు కొత్త ట్రెండ్

స్టార్ కాస్ట్ : నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్‌, రష్మిక తదితరులు..
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాతలు: వైజయంతీ మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌
మ్యూజిక్ : మణిశర్మ
విడుదల తేది : సెప్టెంబర్ 27, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : దేవదాస్ – టాలీవుడ్ కు కొత్త ట్రెండ్

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై అందరిలో భారీ అంచనాలే పెరిగాయి.. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను భారీ స్థాయి లో ఈరోజు థియేటర్స్ లలో విడుదల చేసారు. మరి వారి అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందా..? నాని – నాగ్ నటన ఎలా ఉంది..? అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

దేవా (నాగార్జున ) ఓ మాఫియా డాన్.. ఓ రోజు ఓ ప్రమాదం లో గాయపడి దాస్ (నాని ) అమాయకమైన,ఉద్వేగభరితమైన డాక్టర్ క్లినిక్ లోకి వస్తాడు. దేవా డాన్ అని తెలుసుకున్న దాస్ ఎవరికీ తెలియకుండా ఆయనకు వైద్యం చేయడం మొదలుపెడతాడు. దాస్ అమాయకత్వం చూసి ఎంతో అభిమానం పెంచుకున్న దేవా…తరుచు క్లినిక్ కు వస్తూ దాస్ తో పరిచయం పెంచుకుంటాడు. దానితో వారిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు.

ఓ రోజు దాస్ కళ్ల ముందే దేవా ఓ వ్యక్తి ని చంపుతాడు. ఇది చూసిన దాస్..దేవా తో గొడవ పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఈ కథ కు పూజా ( రేష్మిక ), జాహ్నవి (ఆకాంక్ష సింగ్) లకు సంబంధం ఏంటి…? అసలు దేవా డాన్ ఎందుకు అయ్యాడు..? అసలు ఈ పూర్తి కథ ఏంటి అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* నాగార్జున – నాని ల మధ్య సన్నివేశాలు

* కామెడీ

మైనస్ :

* సెకండ్ హాఫ్

* కొన్ని బోరింగ్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సినిమాకు హైలైట్ అంటే దేవ్ గా నటించిన నాగార్జుననే చెప్పాలి..ఫస్ట్ హాఫ్ అంత దేవ్ తోనే సినిమా సాగుతుంది. నాగ్ ఫై వచ్చే ప్రతి సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. నాగ్ – నాని మధ్య సన్నివేశాలు సైతం బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

*దాస్ గా ఓ అమాయకమైన డాక్టర్ పాత్రలో నాని ఒదిగిపోయి నటించాడు. ఎప్పటిలాగే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తోనూ తన సహజ నటనతోను ఈ చిత్రానికి మరింత పరిపూర్ణత అందించాడు.

* హీరోయిన్స్ విషయానికి వస్తే.. రష్మికా మందన్న మరియు అకాంక్ష సింగ్ లు తెరపై అందంగా కనిపించడమే కాదు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

* వెన్నల కిషోర్ మరియు సత్య మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్లో మంచి నవ్వులను తెప్పించాయి.

* విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్‌ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నా.. ఆ పాత్రను పెద్దగా ఎలివేట్ చేయలేదు.

* ఇక మిగిలిన పాత్రలు చూస్తే.. న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్ తదితరులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం :

* మణిశర్మ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది..బ్యాక్ గ్రౌండ్ మాత్రం సూపర్బ్ గా కుదిరింది.

* శ్యామ్ ద‌త్ సైనూద్దీన్ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.

* వైజయంతి మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ శ్రీరామ్ విషయానికి వస్తే..భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్‌ ఆదిత్య..మొదటిసారి ఇద్దరు టాప్ హీరోలతో వర్క్ చేసాడు. తాను అనుకున్నట్లు సినిమాను తెరకెక్కించాడు..కథ కూడా చాల కొత్తగా ఉంది. చిన్న లైన్ తీసుకొని దానికి కామెడీ జోడించి సినిమాను నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంత నాగ్ – నాని ల మధ్య సన్నివేశాలతో సాఫీగానే సాగిన , సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బోర్ కొట్టించింది. కథాంశం మరియు దాన్ని తీర్చిదిద్దే విధానం ఫై ఇంకాస్త శ్రద్ద పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉండేది.

చివరిగా :

ఇప్పటివరకు ఎన్నో యాక్షన్ మూవీస్ టాలీవుడ్ లో వచ్చాయి కానీ ఈ టైప్ కామెడీ & యాక్షన్ ఎంటర్టైనర్ రావడం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. గతంలో హర్రర్ & కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చితిన్ ప్రేమ కథ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో..ఆ తర్వాత ఇదే తరహా కథలు ఎన్నో వచ్చాయో తెలియంది కాదు. ఇప్పుడు ఈ దేవదాస్ కథ కూడా అలాంటి ట్రెండ్ కు దారితీయవచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

Click here for English Review